యూరిక్ యాసిడ్ పెరిగిందని ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:
యూరిక్ యాసిడ్ పెరిగిందని ఎలా గుర్తించాలి..?

 సాక్షి లైఫ్: కొన్నిరకాల వ్యాధులకు సంబంధించి ముందుగా శరీరంలో ఒక్కోసారి కొన్ని సంకేతాలను పంపుతూంటుంది. వాటిని గుర్తించడం ద్వారా  సమస్యను ముందుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. శరీరం లోపల ఉండే లోటుపాట్లు బాహ్యంగా లక్షణాలుగా కనిపిస్థాయి.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందని తెలుసుకోవడానికీ కొన్ని సంకేతాలుంటాయి. అవేంటంటే..?  
 


మారుతున్న జీవనశైలి శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా పెరగడం మొదలయ్యాయి. అధిక యూరిక్ యాసిడ్ సమస్యను కూడా ఈ జాబితాలో చేర్చారు.

యూరిక్ యాసిడ్ అనేది మనం ప్యూరిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఏర్పడే చెడు పదార్థం. సాధారణంగా మూత్రపిండాల ద్వారా ఈ యూరిక్ యాసిడ్‌ బయటకు వెళుతుంది, అయితే అది అధిక పరిమాణంలో రక్తంలోకి ప్రవేశిస్తే అది శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. 

అటువంటి పరిస్థితిలో, అధిక యూరిక్ యాసిడ్ అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మీ చేతులు, కాళ్ళలో అకస్మాత్తుగా నొప్పి ,వాపు ఉంటే, మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినట్లు గుర్తించాలి.  

అధిక యూరిక్ యాసిడ్ లక్షణాలు, సంకేతాలు.. 

ఆర్థరైటిస్ లేదా గౌట్ సమస్య అధిక యూరిక్ యాసిడ్ వల్ల వస్తుంది. మీరు మీ కీళ్లలో నొప్పి లేదా కాలి వేళ్ళలో వాపు, నొప్పి గా అనిపిస్తే అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లే.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, వికారంగానూ, వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది.

అధిక యూరిక్ యాసిడ్ కారణంగా కండరాల నొప్పి కూడా వస్తుంది. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, యూరిక్ యాసిడ్ స్ఫటికాలు రక్తంలో పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది.
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, నోటికి ఏదీ రుచిగా అనిపించదు.  

శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కడుపులో నొప్పి ఉంటుంది. చర్మం పొడి బారడంతోపాటు నీరసంగా ఉంటుంది. 

యూరిక్ యాసిడ్ను తగ్గించడం ఎలా..?  

అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో ప్రభావవంతమైన అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. యాపిల్, ఉసిరి, పెరుగు తినవచ్చు.

యూరిక్ యాసిడ్ తగ్గించడానికి, సోయాబీన్, ఆర్గాన్ మీట్, సోడా, మష్రూమ్, కిడ్నీ బీన్, క్యాబేజీ ,"సీ" ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. రోజూ యోగా చేయడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ కూడా తగ్గుతాయి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.