చక్కెర స్థాయిలను నియంత్రించే ఆకు.. 

షేర్ చేయండి:
చక్కెర స్థాయిలను నియంత్రించే ఆకు.. 

సాక్షి లైఫ్ : ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందినది మునగ. దీని ఆకులు, విత్తనాలు కూడా తింటారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఆయుర్వేదంలో కూడా మునగను చాలా ప్రత్యేకమైన ఔషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మునగఆకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మునగఆకులో చాలా ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. మునగ ఆకుతోపాటు, మునగకాయలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొరింగ ఆకులు లేదా విత్తనాలు కావచ్చు, అన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

సమృద్ధిగా పోషకాహారం: మునగలో ఏ , సి, ఇ , కె, విటమిన్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం,జింక్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు చాలా అవసరం. ఇమ్యూనిటీ బూస్టర్: మునగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది మునగ.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు పేగు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు : మునగలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి, దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్-2 మధుమేహ రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

ఇది కూడా చదవండి.. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.