సాక్షి లైఫ్ : సాధారణ ప్లేట్‌లెట్ కౌంట్ ఒక మైక్రోలీటర్ రక్తంలో 150,000 నుంచి 450,000 ప్లేట్‌లెట్ల వరకు ఉంటుంది. 450,000 కంటే ఎక్కువ ప్లేట్‌లెట్‌లను కలిగి ఉండడాన్ని థ్రోంబోసైటోసిస్ అని అంటారు.150,000 కంటే తక్కువ ఉంటే థ్రోంబోసైటోపెనియా అంటారు. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సిబిసి) అనే రక్త పరీక్ష చేయించడం ద్వారా మీరు మీ ప్లేట్‌లెట్ సంఖ్య ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..?
డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ కాటు వల్ల వస్తుంది. డెంగ్యూ దోమలు మురికి నీటిలో వృద్ధి చెందుతాయి. డెంగ్యూ వచ్చిన అత్యంత ప్రమాదకరమైనది ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం. ప్లేట్‌లెట్స్ ఎముక మజ్జలోని ఉండే రక్త కణాలు. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1.5 లక్షల నుంచి4 లక్షలప్లేట్‌లెట్లు ఉంటాయి. కానీ డెంగ్యూ విషయంలో వాటి సంఖ్య వేగంగా పడిపోతుంది. దీని కారణంగా రోగి రోగనిరోధక శక్తి బలహీనపడ డమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అనేక ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి పలురకాల ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి.
రక్తస్రావం ఆగదు..
డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, దీనిలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది. తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ కారణంగా గాయాలైనా లేదా కోసుకున్నా రక్తస్రావం ఆగదు. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇందుకోసం బొప్పాయి, దానిమ్మ, బీట్‌రూట్‌లను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ప్లేట్‌లెట్ల కౌంట్ ను పెంచే ఆహార పదార్థాలు..
సిట్రస్ పండ్లు..
డెంగ్యూ రోగులు ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి సిట్రస్ పండ్లను కూడా తీసుకోవాలి. పుల్లటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్, స్వీట్ లైమ్, నిమ్మ, ఉసిరి వంటి పండ్లను తినడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
దానిమ్మ..
దానిమ్మలో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా దానిమ్మలో ఐరన్ కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. ప్లేట్‌లెట్లను పెంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దానిమ్మపండు తినడమే కాకుండా దాని జ్యూస్ కూడా తాగవచ్చు.
పాలకూర..
పాలకూరలో విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఇది ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. విటమిన్ కె తో పాటు, పాలకూరలో ఫోలేట్ కూడా ఉంటుంది. పాలకూరను వెజిటబుల్ సూప్ లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఎలా నియంత్రించవచ్చు..?
బొప్పాయి..
బొప్పాయి ఆకులను తినడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. ఈ ఆకులలో అసిటోజెనిన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది డెంగ్యూలో పడిపోయే ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల తెల్ల రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి.
బీట్‌రూట్..
డెంగ్యూ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ముఖ్యంగా బీట్‌రూట్‌ను చేర్చుకోవాలి. బీట్‌రూట్‌లో ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడానికి పనిచేస్తుంది. మీరు దీన్ని సలాడ్, సూప్ లేదా జ్యూస్ వంటి ఏరూపంలోనైనా తీసుకోవచ్చు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com