దంత సమస్యలకు ప్రధాన కారణాలు.. పరిష్కారాలు..

షేర్ చేయండి:
దంత సమస్యలకు ప్రధాన కారణాలు.. పరిష్కారాలు..

సాక్షి లైఫ్: 2004లో పాఠశాల విద్యార్థుల నోటి ఆరోగ్యంపై జాతీయ స్థాయి సర్వే జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఐదు, 12, 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో దంత వ్యాధుల ప్రాబల్యం గురించి ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాఠశాలకు వెళ్లే పిల్లల్లో దంత సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ముఖ్యంగా 18 ఏళ్ల పిల్లల్లో 51.9 శాతం, 12 ఏళ్ల పిల్లల్లో 53.8 శాతం, 15 ఏళ్ల పిల్లల్లో 63.1 శాతం మంది నోటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.

గతంలో కంటే ప్రస్తుతం ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పిల్లల్లో దంత వ్యాధులు ఎక్కువగా వస్తుండటంతో పాఠశాల విద్య సవాలుగా మారిందని ఐసీఎంఆర్ వెల్లడించింది.

స్కూల్ పిల్లల్లో దంత క్షయం ఎక్కువ.. 

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2019 నివేదిక ప్రకారం, వెనుకబడిన దేశాలలో పాఠశాల విద్యార్థులలో దంత క్షయం ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఇలాంటి కేసుల్లో 50 శాతం తక్కువ ఆదాయ దేశాల్లోనే ఉన్నాయి. అదేవిధంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ఓరల్ హెల్త్ స్టేటస్ రిపోర్ట్ 2022 ప్రకారం, దంత క్షయంతో పాఠశాలల్లో చదివే పిల్లల్లో 350కోట్ల మంది బాధపడుతున్నారు.

నోటి ఆరోగ్యం అంటే దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్నే నోటి ఆరోగ్యం(ఓరల్ హెల్త్ ) అంటారు. నోటి సమస్యలను సాధారణంగా "దంత సమస్యలు" అని కూడా అంటారు.

దంత సమస్యలలో అదనపుదంతాలు, దంతాలు విరగడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు ఉంటాయి. అవి నొప్పిని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్యలు ఆహారం తినే వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది ఒక వ్యక్తి ఆత్మగౌరవంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులకు అత్యంత సాధారణ కారణాలలో దంత వ్యాధి ఒకటి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2017 ప్రకారం, సుమారు 350 కోట్ల మంది ప్రజలు నోటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం, ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు దంత  సమస్యలను ఎదుర్కొంటున్నారు.

గమనిక: దయచేసి దీన్ని సమాచారంగా మాత్రమే పరిగణించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోకండి. దాని కోసం, వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.