Vegan Diet : వీగన్ డైట్ ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తుందా..? ప్రయోజనాలు, ప్రతికూలతలు ఇవే..!
సాక్షిలైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా మొక్కల ఆధారిత (plant-based) ఆహారం అయిన 'వీగన్ డైట్' (Vegan Diet) తీసుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే, వీగన్ డైట్ అందరికీ మంచిదేనా..? దీని వల్ల లాభాలతో పాటు ఏమైనా అనర్థాలు ఉన్నాయా..? వైద్య నివేదికలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
వీగన్ డైట్ అంటే ఏమిటి..?
వీగన్ డైట్ అంటే కేవలం మాంసాహారానికి దూరంగా ఉండటం మాత్రమే కాదు. పాలు, పెరుగు, నెయ్యి, జున్ను, వెన్న, గుడ్లు వంటి జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేయాలి. కేవలం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్, సోయా వంటి మొక్కల నుంచి లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
బరువు తగ్గడంలో..
వీగన్ డైట్ వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీగన్ డైట్ వల్ల కేవలం నాలుగు నెలల్లో సుమారు 6 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మధుమేహం నియంత్రణ..
టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారు కనీసం 12 వారాల పాటు ఈ డైట్ పాటిస్తే.. బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), కొలెస్ట్రాల్, హెచ్‌బీఏ1సీ (HbA1c) స్థాయిల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
మెరుగైన జీవక్రియ..
ఈ ఆహారంలో పీచుపదార్థం (fiber), అవసరమైన ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది.
పొంచి ఉన్న ప్రమాదాలు - విటమిన్ బి12 లోపం..
వీగన్ డైట్ మంచిదే అయినప్పటికీ, దీర్ఘకాలం పాటు పాటిస్తే శరీరంలో కీలకమైన పోషకాల లోపం తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందులో ప్రధానమైనది విటమిన్ బి12.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరుకు, డీఎన్ఏ నిర్మాణానికి విటమిన్ బి12 చాలా అవసరం. శరీరం దానంతట అది దీనిని ఉత్పత్తి చేసుకోలేదు.
వయోజనులకు రోజుకు దాదాపు 2.4 మైక్రోగ్రాముల బి12 అవసరం అవుతుంది.
ఇది సహజంగా మాంసం, చేపలు, పాలు, గుడ్లు వంటి జంతు సంబంధ ఉత్పత్తుల్లోనే ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి వీగన్స్ బి12 లోపం బారిన పడే అవకాశం ఎక్కువ.
సరైన సప్లిమెంట్లు తీసుకోకుండా సుదీర్ఘకాలం వీగన్ డైట్ పాటిస్తే, ఆందోళన, డిప్రెషన్, తీవ్రమైన కేసుల్లో సైకోసిస్ వంటి నాడీ సంబంధిత (Neurological) సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?
సరైన ప్రణాళిక లేకుండా వీగన్ డైట్ పాటిస్తే విటమిన్ బి12తో పాటు ఐరన్, కాల్షియం, అయోడిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం వంటి పోషకాల కొరత కూడా ఏర్పడుతుంది. వాటిని భర్తీ చేయడానికి ఈ ఆహారాలను ఎంచుకోవాలి.
ఐరన్,కాల్షియం కోసం..
ఫోర్టిఫైడ్ ప్లాంట్ మిల్క్, టోఫు, ఆకుకూరలు, నువ్వులు, పప్పు ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. మొక్కల నుంచి లభించే ఐరన్ శరీరంలో త్వరగా గ్రహించబడదు కాబట్టి జాగ్రత్త వహించాలి. అవిసె గింజలు (Flaxseeds), చియా సీడ్స్, వాల్ నట్స్ తీసుకోవాలి.
పసిపిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ డైట్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాబట్టి, ఎవరికి వారు సొంతంగా వీగన్ డైట్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా డైటీషియన్ లేదా వైద్యుల సలహా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
