High Blood Pressure : హైబీపీని పెంచే ప్రధాన కారణాలు ఏమిటో తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అధిక రక్తపోటు (High Blood Pressure) అనేది చాపకింద నీరులాంటిది. అందుకే దీనిని వైద్యులు 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. చాలా సందర్భాల్లో దీని ప్రారంభ లక్షణాలు బయటకు కనిపించవు. కానీ నెమ్మదిగా గుండె, మెదడు, కిడ్నీలు, కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ రోజుల్లో యువత కూడా హైబీపీ బారిన పడుతున్నారు. మందుల వాడకంతో పాటు సరైన జీవనశైలి, పోషకాహారం తీసుకుంటేనే రక్తపోటును నియంత్రించగలం. అసలు బీపీ వేగంగా పెరగడానికి దారితీసే ఆ ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

1. ఉప్పు మోతాదు మించితే..

ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు (salt) తీసుకోవడం హైబీపీకి అతిపెద్ద కారణం. సోడియం ఎక్కువైతే శరీరంలో నీరు నిలిచిపోయి రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, పచ్చళ్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పును పరిమితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

2. మానసిక ఒత్తిడి..

నిరంతర ఆందోళన, మానసిక ఒత్తిడి(Mental stress)వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే, అది శాశ్వత హైబీపీ సమస్యగా మారే ప్రమాదం ఉంది. యోగా, ధ్యానం, తగినంత నిద్ర ద్వారా ఒత్తిడిని జయించవచ్చు.

3. శారీరక శ్రమ లేకపోవడం..

రోజంతా కూర్చుని పనిచేయడం, ఎలాంటి వ్యాయామం చేయకపోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా రక్తపోటు కూడా పెరుగుతుంది. నిపుణుల సలహా ప్రకారం, రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం ( brisk walk), సైక్లింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

4. అధిక బరువు, ఊబకాయం..  

ఊబకాయం హైబీపీకి ప్రధాన శత్రువు. శరీర బరువు పెరిగినప్పుడు, శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపై భారం పడుతుంది. సరైన డైట్, వ్యాయామంతో బరువును అదుపులో ఉంచుకుంటే బీపీని కూడా సులభంగా నియంత్రించవచ్చు.

5. ధూమపానం, మద్యపానం..  

సిగరెట్లలో ఉండే నికోటిన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. అలాగే, మితిమీరిన మద్యపానం కూడా దీర్ఘకాలంలో గుండె, రక్తపోటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రెండు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే గుండెకు అంత మేలు.

బీపీని అదుపులో ఉంచుకునేందుకు కొన్ని సూచనలు..

ఆహారంలో ఉప్పును తగ్గించండి, అలాగే నిల్వ ఉంచిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు తప్పనిసరిగా వ్యాయామం లేదా వాకింగ్ చేయండి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం (Meditation) సాధన చేయండి.

రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి, బరువును నియంత్రణలో ఉంచుకోండి. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం మర్చిపోవద్దు. ముఖ్య గమనిక: వైద్యుడి సలహా లేకుండా బీపీ మందులు వాడటం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు.

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.