Jaggery And Chickpea : బెల్లం - శనగలు రోజూ తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..?
సాక్షి లైఫ్ : బెల్లం, శనగలు కలిపి తినడం మన భారతీయ ఇళ్లలో ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. రుచితో పాటు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో సహజమైన తీపితో పాటు ఖనిజాలు ఉంటాయి. శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో, వీటిని స్నాక్‌గా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
బెల్లం-శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
తక్షణ శక్తి (Instant Energy)..బెల్లంలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఉంటాయి. అదేవిధంగా శనగల్లో ప్రోటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలసటగా ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
జీర్ణవ్యవస్థకు మేలు..
శనగల్లో ఫైబర్ (fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం కూడా అరుగుదలకు సహాయపడుతుంది.
బరువు నియంత్రణ..
శనగల్లోని ప్రోటీన్, ఫైబర్ వల్ల వీటిని కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మాటిమాటికీ ఏదో ఒకటి తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, జంక్ ఫుడ్‌కు బదులుగా దీన్ని స్నాక్‌గా ఎంచుకోవచ్చు. అయితే క్యాలరీల నియంత్రణ కోసం బెల్లం మోతాదు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఐరన్ లోపానికి చెక్..
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శనగల్లో కూడా ఐరన్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఈ రెండింటినీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ అంది, రక్తహీనత (anemia) సమస్య దూరమవుతుంది.
కండరాల పుష్టి కోసం..
మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు శనగలు మంచి మూలం. కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మతులకు శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. రోజూవారీ డైట్లో వీటిని చేర్చుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి.
రోగనిరోధక శక్తి (Immunity)..
ఈ రెండింటిలో ఉండే వివిధ రకాల సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్, ఫోలేట్ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
