Monsoon Health Guide 2026: వర్షాకాలంలో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది, అప్రమత్తంగా ఉండండి.. ఇలా.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం రాకతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారినప్పటికీ, అది అనేక ఆరోగ్య సవాళ్లను కూడా వెంట తెస్తుంది. ఈ సీజన్‌లో గాలిలో తేమ పెరగడం, అక్కడక్కడా నీరు నిలిచిపోవడం వల్ల దోమలు, బ్యాక్టీరియాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా అనేక అంటువ్యాధులు, కాలానుగుణ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాకాలంలో మనల్ని వేధించే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు ,నివారణా మార్గాలపై సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

1. డెంగ్యూ జ్వరం..

వర్షాకాలంలో అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది ‘ఏడిస్ ఈజిప్టి’ అనే దోమ కాటు వల్ల వస్తుంది. ఇవి సాధారణంగా ఇళ్లల్లో లేదా పరిసరాల్లో నిలిచి ఉండే శుభ్రమైన నీటిలో అంటే..? కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు, నీటి ట్యాంకులలో ఉండే నీటిలో వృద్ధి చెందుతాయి.

లక్షణాలు ఎలా ఉంటాయి..? ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు. తీవ్రత ఎక్కువైతే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది.

2. మలేరియా..

నిల్వ ఉన్న మురికి నీటిలో పెరిగే ‘ఆడ అనోఫిలస్’ దోమ కాటు వల్ల మలేరియా వ్యాపిస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..? విపరీతమైన చలి, వణుకుతో కూడిన అధిక జ్వరం, చెమటలు పట్టడం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం దీని ప్రధాన లక్షణాలు.

3. టైఫాయిడ్..

ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా సంక్రమించే ప్రమాదకర బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో ఈ వ్యాధి ముప్పు మరీ ఎక్కువ.

లక్షణాలు ఎలా ఉంటాయి..? రోజురోజుకూ జ్వరం పెరగడం, తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, ఆకలి మందగించడం, విరేచనాలు లేదా మలబద్ధకం.

4. వైరల్ జ్వరాలు (Viral Fevers)..

వాతావరణంలో వచ్చే అకస్మాత్తు మార్పులు, తేమ కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులతో కూడిన అలసట దీని లక్షణాలు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయవచ్చు.

5. గ్యాస్ట్రో ఎంటరైటిస్..

వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వల్ల ఆహార పదార్థాలు చాలా త్వరగా పాడైపోతాయి. ఈ కాలంలో ఈగలు, దోమల ద్వారా ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..? వాంతులు, కడుపు తిప్పడం, పదే పదే విరేచనాలు కావడం, డీహైడ్రేషన్ అవ్వడం.

నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు..

పరిసరాల పరిశుభ్రత..ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు వృద్ధి చెందే ఆస్కారం ఉన్న వస్తువులను తొలగించాలి.

సురక్షిత తాగునీరు.. నీటిని బాగా కాచి, చల్లార్చిన తర్వాతే తాగడం ఉత్తమం. బయటి నీటిని పూర్తిగా నివారించాలి.

ఆహార నియమాలు.. రోడ్డు పక్కన బహిరంగంగా అమ్మే చాట్, కట్ చేసిన పండ్లు, జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వేడిగా వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

దోమల నివారణ.. రాత్రి వేళల్లో దోమతెరలు వాడటం, ఒంటికి దోమలు కుట్టకుండా ఉండే క్రీములు లేదా పొడవాటి దుస్తులు ధరించడం మంచిది.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.