Normal Milk vs A2 Milk : నార్మల్ మిల్క్.. A2 మిల్క్..? ఆరోగ్యానికి ఏవి ఉత్తమం..?    

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పాలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రోటీన్.. ఒక కప్పు పాలలో సుమారు 8.14 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో సాధారణ పాల కంటే A2 పాలు తాగే వారి సంఖ్య పెరుగుతోంది. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? A2 పాలు ఎందుకు శ్రేష్ఠమైనవో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

 

ప్రోటీన్ల వ్యత్యాసమే ప్రధానం.. 

సాధారణ ఆవు పాలలో A1 , A2 అనే రెండు రకాల బీటా-కేసిన్ ప్రోటీన్లు ఉంటాయి. కానీ A2 పాలలో కేవలం ఒకే రకమైన బీటా-కేసిన్ ఉంటుంది. సాధారణ పాల్లో ఉండే A1 ప్రోటీన్ జీర్ణక్రియ సమయంలో చిన్న ప్రేగులలో 'బీటా-కాసోమోర్ఫిన్-7' (BCM-7)గా మారుతుంది. ఇది రక్తంలో కలవడం వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే A2 పాలు తల్లి పాలు, మేక మరియు గేదె పాలను పోలి ఉండి సులభంగా జీర్ణమవుతాయి.

A2 పాలతో అద్భుత ప్రయోజనాలు..

A2 పాలలో విటమిన్-A, D, B12తో పాటు కాల్షియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. A2 పాలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్-A సమృద్ధిగా ఉండటం వల్ల రెటీనా, కార్నియా ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. విటమిన్-D తో కూడిన A2 పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక స్థితి (Mood) మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

A2 పాలు సురక్షితమైనవే అయినప్పటికీ..

A2 పాలు సురక్షితమైనవే అయినప్పటికీ, పాలు పడని వారు (Milk Allergy) వీటిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ఎంచుకోవాలి. ఒకవేళ ఏ రకమైన పాలు పడకపోతే.. సోయా పాలు, బాదం పాలు లేదా ఓట్ మిల్క్ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.