Milk Bottle : ప్లాస్టిక్ వర్సెస్ స్టీల్ బాటిల్ : మీ బిడ్డకు ఏది సురక్షితం..?
సాక్షి లైఫ్ : నవజాత శిశువు ఇంటికి రాగానే తల్లిదండ్రుల బాధ్యతలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు పాలు పట్టేందుకు ఎలాంటి ఫీడింగ్ బాటిల్‌ను ఎంచుకోవాలనే విషయంలో చాలామంది అయోమయానికి గురవుతుంటారు. "మార్కెట్లో దొరికే రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్లు మంచివా..? లేక సాంప్రదాయంగా ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు సురక్షితమా..?" అనే సందేహం ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతుంది. బిడ్డ ఆరోగ్యం నేరుగా ఈ బాటిల్ నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఎంపికలో అప్రమత్తత చాలా అవసరం.
కేవలం బాటిల్ ధర లేదా అందమైన డిజైన్‌ను మాత్రమే చూసి మోసపోకుండా.. వాటి భద్రతా ప్రమాణాలు, మన్నిక, శుభ్రపరిచే సౌలభ్యాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇందుకోసం ప్లాస్టిక్, స్టీల్ బాటిళ్ల వల్ల కలిగే లాభనష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Rare IgG4-Related Disease Mimics Cancer : క్యాన్సర్‌ను పోలి ఉండే అరుదైన వ్యాధి 'IgG4' .. భారత్ లో విజృంభిస్తున్న న్యూ డిసీజ్..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిళ్లు..తేలికైనవే కానీ..!
ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యేవి ప్లాస్టిక్ బాటిళ్లే. ఇవి వాడటానికి ఎంతో వీలుగా ఉన్నప్పటికీ, వీటితో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ప్రయోజనాలు ఏమిటి..?
తక్కువ బరువు..ఇవి చాలా తేలికగా ఉండటం వల్ల శిశువులు సైతం వీటిని సులభంగా పట్టుకోగలరు.
పగిలే ప్రమాదం లేదు.. చేతిలోంచి కింద పడినా ఇవి పగలవు.
రకరకాల డిజైన్లు..మార్కెట్లో విభిన్న ఆకారాలు, సైజుల్లో తక్కువ ధరకే లభిస్తాయి.
లోపాలు..
నాసిరకం ప్లాస్టిక్ బాటిళ్లను వేడి చేసినప్పుడు వాటిలోని హానికరమైన రసాయనాలు పాలల్లో కలిసే ప్రమాదం ఉంది. వీటిని ఎక్కువ రోజులు వాడితే లోపల గీతలు (Scratches) పడి, అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తరచూ మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాస్టిక్ బాటిల్ కొనాలనుకుంటే, అది కచ్చితంగా అధిక నాణ్యత కలిగిన, కెమికల్ రహిత 'BPA-Free' బాటిల్ అవునా కాదా అని పరీక్షించి మాత్రమే తీసుకోవాలి.
స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు.. మన్నికైన భద్రత..
ఆధునిక తల్లిదండ్రులు ఇప్పుడు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ బాటిళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య పరంగా ఇవి ఎంతో మేలైనవిగా గుర్తింపు పొందాయి.
ప్రయోజనాలు..
కెమికల్ ఫ్రీ..వీటి నుంచి ఎలాంటి రసాయనాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండదు కాబట్టి పాలు ఎంతో సురక్షితంగా ఉంటాయి. మన్నిక ఎక్కువ.. ఇవి చాలా బలంగా ఉండి, ఎక్కువ కాలం మన్నుతాయి. ప్రయాణాల్లో వాడుకోవడానికి ఎంతో అనుకూలం. వీటిని సులభంగా తోముకోవచ్చు, వేడి నీళ్లలో వేసి స్టెరిలైజ్ చేయడం కూడా చాలా తేలిక.
లోపాలు..?
ప్లాస్టిక్ బాటిళ్లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇవి పారదర్శకంగా ఉండవు కాబట్టి బాటిల్‌లో పాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో బయటి నుంచి చూడటం కష్టం. కొన్ని మోడల్స్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు స్వయంగా పట్టుకోవడానికి ఇబ్బంది పడవచ్చు.
ఏది ఉత్తమమైన ఎంపిక..?
పసిబిడ్డ చాలా చిన్న వయసులో ఉండి, తల్లిదండ్రులే దగ్గరుండి పాలు పడుతున్నట్లయితే.. నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన 'BPA-రహిత' ప్లాస్టిక్ బాటిల్‌ను నిశ్చింతగా వాడవచ్చు. అయితే, రసాయనాల భయం లేకుండా, లాంగ్ రన్ లో ఎలాంటి ఆరోగ్య రిస్క్ తీసుకోకూడదని భావిస్తే మాత్రం స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిలే అత్యంత సురక్షితమైన మార్గం. బిడ్డ వయసు, మీ బడ్జెట్, సౌకర్యాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
