సాక్షి లైఫ్ : సైనస్ సమస్య ఉన్నవారికి తరచుగా ముక్కు కారుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా కూడా ఆవిరి పట్టడంవల్ల సమస్య తాత్కాలికంగా కొంత వరకు పరిష్కారం అవుతుంది.
ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు
వేడి పానీయాలు..
చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది.
ఆల్కహాల్..
ఆల్కహాల్ సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మద్యం తీసుకోకపోవడం మంచిది. చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చల్లని నీటితో కూడా తలస్నానం చేయవద్దని వారు చెబుతున్నారు.
మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయా..? చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండకాపోతే సైనస్ సమస్య మరింతగా పెరుగుతుందా..?అసలు సైనసిటిస్ అనేది ఎన్నిరకాలున్నది..? క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? సైనస్ ఉంటే చల్లని నీటితో కూడా తలస్నానం చేయకూడదా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..