గుండె జబ్బులు రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : గతంలో యాభై ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా గుండె జబ్బులు తలెత్తేవి. ప్రస్తుతం ఇరవై ఏళ్ల వయస్సులోపు వారిలో సైతం గుండె జబ్బులు తలెత్తుతున్నాయా..? హార్ట్ స్ట్రోక్ రావడానికి అనేక కారణాలున్నాయి. అయితే గుండె జబ్బులు రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి..? ఏమేం జాగ్రత్తలు పాటించాలి..?
గుండె జబ్బులు ఎలా వస్తాయి..? ఎవరెవరికి వస్తాయి..? రాకుండా ముందే గుర్తించడమెలా..? అనేది ముందుగా తెలుసుకోవాలి. గుండె జబ్బుల సూచనలు కనిపిస్తే ముందే అడ్డుకోవచ్చా..? అస్సలు రాకుండా నివారించొచ్చా..?అంటే అవును అని సమాధానమిస్తున్నారు ప్రముఖ కార్డియాలజిస్టులు.
ఊబకాయం..
యాభైఏళ్లు పైబడిన వారికి.. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి సమస్యలున్న వారికి మాత్రమే గుండె జబ్బులొస్తాయనేది పాత మాట. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న గుండె జబ్బుల కేసుల సంఖ్య చూస్తే షాక్ అవ్వాల్సిందే . వయసు మళ్లిన వారు.. ఊబకాయంతో ఉన్న వారు.. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువున్న వారికే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
టీనేజర్స్ లో..
ముఖ్యంగా టీనేజర్స్ లో కూడా గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. వయసు మళ్లినవారి కంటే యువతలో ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ గా వ్యాయామం..
రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు శారీరక శ్రమ, నడక తప్పనిసరి చేసుకోవాలి. అంతేకాదు మద్యం, పొగ తాగడం పూర్తిగా మానెయ్యాలి. ముఖ్యంగా జిమ్ చేస్తున్న వారు శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మంచి పౌష్టిక విలువలున్న పప్పుదినుసుల ఆహారం తీసుకోవాలి. ఆహారంలో నాణ్యత ముఖ్యం. రెడీ మేడ్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. కొవ్వు, కేలరీస్ లేని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఆహారంలో నూనె తగ్గించాలి.
తినే ఆహారంలో..
రోజూ తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. పని ఒత్తిడి అలవాట్లను దూరం చేసుకోవాలి.. ఆడుతూ పాడుతూ పనిచేసే అలవాటు పెంచుకోవాలి.
పరిశోధకులు..
కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గడానికి, గుండె జబ్బులకు కారణమయ్యే ప్రమాదకర స్థాయిలను పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయన ఫలితాలు చర్చనీయాంశమైనప్పటికీ మనరోజు వారి ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలని వైద్యనిపుణులు అంటున్నారు.
పండ్లు , కూరగాయలు ఆరోగ్యకరమైన, ఆహారానికి ఉపయోగపడతాయి. వీటిలో సాధారణంగా, కొవ్వు తక్కువగా ఉంటాయి. వీటిని నూనెతో కలిపి వేయించకుండా తీసుకోవాలి.
ఫైబర్..
పండ్లు , కూరగాయల్లో ఫోలెట్ వంటి విటమిన్లు, పొటాషియం వంటి పదార్థాలకు మంచి మూలం. కూరగాయలు ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది జీర్ణక్రియ సమస్యలను నివారించవచ్చు. ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు,పలు రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడం లో ఇవి సహాయపడతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
