డయాబెటిక్ ఉన్న వారిలో ఇన్ఫెక్షన్లు పెరగడానికి కారణాలు..?  

షేర్ చేయండి:
డయాబెటిక్ ఉన్న వారిలో ఇన్ఫెక్షన్లు పెరగడానికి కారణాలు..?  

సాక్షి లైఫ్ : మధుమేహం ఉన్నవారికి కొన్నిరకాల అనారోగ్య సమస్యలు సహజంగానే వస్తుంటాయి. నెమ్మదిగా తగ్గుతాయి. ఎందుకంటే వీరి శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందువల్ల, డయాబెటిక్ రోగుల శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే త్వరగా అభివృద్ధి చెందుతుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే డయాబెటిక్ రోగుల శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తగ్గడం కొంచెం ఆలస్యంగా తగ్గుతుంది. అదే విషయం ఈస్ట్ ఇన్ఫెక్షన్ లోను వర్తిస్తుంది. అందువల్ల, మధుమేహంతో బాధపడుతున్న మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయా..?

ఇది చాలా వరకు నిజం. ఈస్ట్ అనే ఫంగస్ శరీరంలోని అదనపు చక్కెరను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల, ఎక్కువ పరిమాణంలో తీపి పదార్థాలను తీసుకునే వ్యక్తులలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ సమస్యను ఎలా నివారించాలి..?  

పెరుగులో కొన్ని ఈస్ట్ రెసిస్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ నుంచి యోనిని రక్షించడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ సమస్యను నివారించడానికి వారి ఆహారంలో పెరుగు, మజ్జిగ , లస్సీ వంటివి  చేర్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్స.. 

పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ అవసరాన్ని బట్టి శానిటరీ ప్యాడ్‌ని 4 నుంచి 6 గంటల వ్యవధిలో మార్చుకోండి. సువాసన కలిగిన ప్యాంటీ లైనర్లను ఉపయోగించవద్దు. యోనిని సాధారణ నీటితో మాత్రమే కడగాలి, సబ్బును ఉపయోగించవద్దు.

 భార్యాభర్తల్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, లైంగిక సంపర్కానికి దూరంగా ఉండండి. స్విమ్మింగ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇన్ఫెక్షన్ సమయంలో ఈతకు దూరంగా ఉండటం, స్నానం చేసేటప్పుడు బాత్‌టబ్‌ని ఉపయోగించకపోవడం మంచిది. 

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..

ఎల్లప్పుడూ నాణ్యమైన కాటన్ లోదుస్తులను ఉపయోగించండి. ఇన్ఫెక్షన్ సంశయంలో అలాంటి దుస్తులను వాషింగ్ మెషీన్‌కు బదులుగా చేతితో ఉతికి, వాటిని ఎప్పుడూ ఎండలో ఆరబెట్టండి. వేసవి కాలంలో, అధిక చెమట ఉన్నప్పుడు, రోజుకు రెండుసార్లు లోదుస్తులను మార్చండి ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్‌కు చెమట కూడా కారణం. 

దూర ప్రయాణాల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మిఠాయిలు, శీతల పానీయాలు, చాక్లెట్, పేస్ట్రీలు వంటి వాటిని పరిమిత పరిమాణంలో తీసుకోండి.

దురద వంటి ఏవైనా లక్షణాలున్నట్లయితే, సొంతంగా ఏ మందులు  వాడొద్దు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌లను తప్పనిసరిగా సంప్రదించండి. 

కొన్ని మందులు తీసుకోవడం, లేపనాలు ఉపయోగించడం ద్వారా ఈ సమస్య త్వరగా పోతుంది. పూర్తిస్థాయి  చికిత్స తీసుకోవాలి. డాక్టర్ చెప్పిన అన్ని సూచనలను అనుసరించడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.

ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.