భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
సాక్షి లైఫ్ : కొన్ని దశాబ్దాలుగా, భారతీయుల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇవి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నేటితరం యువకులలో తీవ్రమైన వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తీసుకునే ఆహరం కారణంగా వారి ఆకృతిలో సైతం మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) భారతీయుల కోసం ప్రస్తుత జీవనశైలికి తగినట్లుగా మార్పులు, చేర్పులు చేసిన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.
భారతీయులు ఏమి తినాలి..?
భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎమ్ఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ ఆహార మార్గదర్శకాలను విడుదల చేశారు. మధుమేహాన్ని నిరోధించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యమని ఐసిఎమ్ఆర్ నొక్కిచెప్పింది.
ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్) పోషకాహార లోపాలను నివారించడానికి 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని పరిష్కరించడానికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. భారతదేశంలో ఎక్కువ వ్యాధులు 56.4 శాతంపైగా అనారోగ్యకరమైన ఆహారాల వల్లనే వస్తున్నట్లు ఐసిఎమ్ఆర్ తెలిపింది.
ఎయిర్ ఫ్రైయింగ్ అండ్ గ్రానైట్ పూతతో కూడిన వంటసామాను కూడా ఆమోదించింది. ప్యాక్ చేసిన ఆహారం, లేబుల్‌లను వివరించడానికి సంస్థ మొదటి సారి మార్గదర్శకాలను, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీ జారీ చేసింది.
ప్రోటీన్ సప్లిమెంట్లను నివారించండి..
"ప్రోటీన్ సప్లిమెంట్లను వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుండడంతో దీనిని నివారించాలని ఎన్ఐఎన్ కోరింది. దీనికి బదులు గుడ్లు, పాలు, సోయాబీన్స్, బఠానీలు తీసుకోవాలని సూచించింది. ప్రోటీన్ పౌడర్‌లలో చక్కెర, కేలరీలు లేని స్వీటెనర్లు కలుపుతారు. వీటివల్ల కృత్రిమ రుచి కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
