ఎక్కువ సార్లు మూత్రం నడవడానికి కారణాలివే..
సాక్షి లైఫ్ : ప్రతి మనిషి రోజు ఐదు లేదా ఆరు సార్లు మూత్రానికి వెళ్ళటం సహజం. రాత్రిపూట తీసుకున్న ద్రవాహారాన్ని బట్టి మధ్య రాత్రిలో కూడా ఒకసారి మూత్రానికి వెళ్లాల్సి రావచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.ఈ సహజ ప్రక్రియలో ఏ మాత్రం తేడా కన్పించినా వెంటనే అందుకు కారణాన్ని వెదకాల్సి వుంటుంది. మూత్రం, ఎక్కువసార్లు ఎక్కువ పరిమాణాలలో వెళ్ళటాన్ని "అతిమూత్రం” అంటారు. ఇది ఏదైనా వ్యాధిగా వచ్చిందా లేదా ఇంకేదైనా వ్యాధిలో ఒక వ్యాధి లక్షణంగా వచ్చిందా అనేది పరిశీలించవలసి వుంటుంది. కొన్ని కారణాలువుంటాయి.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో మూత్రం పదేపదే వస్తూ ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో వెళ్లడం, రాత్రిపూట ఒకటి కన్నా ఎక్కువసార్లు అవటం జరగవచ్చు. దీన్ని "డయాబెటిస్ మెలిటస్" అంటారు. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే మరో అతిమూత్ర వ్యాధిలో కూడా ఇలానే మూత్రం ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావచ్చు. గర్భవతులకు మూత్రాశయం నిండుగా పట్టే చోటు ఉండదు కాబట్టి మూత్రం ఎక్కువసార్లు వెళ్ళవచ్చు. థైరాయిడ్ గ్రంధిలో లోపం వల్ల కూడా అతిమూత్రం సమస్య వస్తుంది. మానసిక వ్యాధులు, ఆందోళనలు, భయం, దిగుళ్లు. యాంగ్జయిటీ న్యూరోసిస్ లాంటి వ్యాధులున్న వారు కూడా మూత్రం ఎక్కువసార్లు వెళ్లాల్సి రావొచ్చు.
కిడ్నీలలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు మూత్రం పచ్చగా, మంటగా, ఎక్కువసార్లు వస్తుంది. బీపీ ఉన్నవారిలో కూడా మూత్రం ఎక్కువగా అయ్యేందుకు మందులు వాడతారు. అదికూడా ఒక కారణం కావచ్చు. మూత్రంలోంచి అల్బుమిన్ పోతున్నప్పుడు కూడా మూత్రం వెళ్ళేతీరులో తేడా లొస్తాయి.అతిగా ద్రవ పదార్థాలు, ఆల్కాహాలు తీసుకునే వాళ్ళకు పదేపదే మూత్ర విసర్జన చేయవలసి రావచ్చు.
ఇది కూడా చదవండి.. ఫిట్స్ కు కారణం ఏమిటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
