Hypertension : సైలెంట్ కిల్లర్ బి.పి. : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే వెంటనే అప్రమత్తమవ్వండి..!

షేర్ చేయండి:
Hypertension : సైలెంట్ కిల్లర్ బి.పి. : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే వెంటనే అప్రమత్తమవ్వండి..!

సాక్షి లైఫ్ : రక్తపోటు (blood pressure) అనేది ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే, దీని బారిన పడిన చాలామందికి ప్రాథమిక దశలో అసలు ఆ విషయమే తెలియకపోవడం అత్యంత ప్రమాదకరం. అందుకే వైద్యులు అధిక రక్తపోటును 'సైలెంట్ కిల్లర్' (Silent Killer) అని పిలుస్తారు. ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండానే ఇది లోలోపల శరీరాన్ని గుల్ల చేస్తుంది. ఒకప్పుడు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పదేళ్ల లోపు పిల్లల్లో, యువతలో కూడా విపరీతంగా పెరుగుతోంది. భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతం (Brain Stroke), కిడ్నీ వ్యాధులకు దారితీసే ఈ మహమ్మారి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా కొన్నిరకాల లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

 

ఇది కూడా చదవండి.. Liver Health : కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

1. ఉదయం పూట తలనొప్పి వస్తోందా..?

చాలామందికి పొద్దున్నే నిద్రలేవగానే తలనొప్పిగా అనిపిస్తుంది. దీనిని సాధారణ సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు. కానీ, దీర్ఘకాలంగా నియంత్రణలో లేని అధిక రక్తపోటు మెదడులోని రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా తరచూ తలనొప్పి వస్తుంది. ఈ నొప్పితో పాటు తల తిరగడం, నీరసం, చూపు మసకబారడం వంటివి ఉంటే వెంటనే బీపీ పరీక్ష చేయించుకోవాలి.

2. చూపు మసకబారడం.. చదవడంలో ఇబ్బంది..

అధిక రక్తపోటు కంటి చూపుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లలోని చిన్న చిన్న రక్తనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. బీపీ నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల కంటిలోని రెటీనా నాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల చూపు మసకబారడం, పుస్తకాలు చదివేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. కంటి సమస్య అని కళ్లద్దాలు మార్చే ముందు, ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం ఉత్తమం.

3. కొద్దిపాటి శ్రమకే ఆయాసం, అలసట.. 

మెట్లు ఎక్కేటప్పుడు లేదా చిన్నపాటి పనులు చేసేటప్పుడు కూడా రొప్పుతుండటం, విపరీతమైన అలసట రావడం అధిక రక్తపోటుకు ప్రధాన సంకేతం కావచ్చు. రక్తపోటు పెరిగినప్పుడు శరీరం మొత్తానికి రక్తాన్ని పంపడానికి గుండె సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపై భారం పడి ఆయాసం వస్తుంది.

4. అకస్మాత్తుగా గుండె వేగం పెరగడం.. 

ఎలాంటి శారీరక శ్రమ లేదా కంగారు లేకుండానే అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకుంటోందా..? గుండె దడగా అనిపిస్తోందా..? కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల లేదా ఒత్తిడి వల్ల కూడా ఇలా జరగొచ్చు. కానీ, ఈ సమస్య తరచూ పునరావృతమైతే మాత్రం అది పెరిగిన బీపీకి సూచన కావచ్చు. గుండె వేగంతో పాటు ఛాతీలో నొప్పి లేదా తల తిరిగినట్లు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా రక్తపోటును తనిఖీ చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందే గుర్తిస్తే జీవనశైలి మార్పులు, సరైన ఆహార నియమాలతో ఈ సైలెంట్ కిల్లర్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. 

ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.