శీతాకాలంలో బరువు పెరగడానికి ఇవే కారణాలు..
సాక్షి లైఫ్ : చలి కారణంగా దుప్పట్లు కప్పుకుని ఉండటానికి ఇష్టపడతారు. వెచ్చని దుప్పటిని వదిలి బయటకు వెళ్లాలనిపించదు, దీని వల్ల శీతాకాలంలో శారీరక శ్రమ వేగంగా తగ్గుతుంది. శీతాకాలంలో బరువు పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణాలలో ఒకటి. శీతాకాలంలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో కొన్నిరకాల పిండి వంటకాలను తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది.
చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడానికి చాలామంది నూనె, సుగంధ ద్రవ్యాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇది శరీరానికి హానికరం. అంతేకాదు ఇవి కూడా వేగంగా బరువు పెరగడానికి కారణమవుతాయి.
వింటర్ సీజన్ రాగానే కొంతమందికి సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వస్తుంది. ఈ సమయంలో వాంతులు, వికారం, నిద్రలేమి, నిరాశ, శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో వ్యాయామాలు రిగ్యులర్ గా చేయకపోవడం కారణంగానూ, అతిగా తినడం కూడా బరువు పెరగడానికి కారణాలే.
శీతాకాలంలో పగలు సమయం తక్కువగానూ రాత్రుల సమయం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రాత్రిపూట పలురకాల జంక్ ఫుడ్స్ తీసుకోవడం జరుగుతుంది. దీని కారణంగా బరువు పెరగడం సాధ్యమవుతుంది.
శీతాకాలంలో ప్రజలు అవసరమైన దానికంటే ఎక్కువగా పాలతో టీ తాగుతుంటారు. పాలు , శుద్ధి చేసిన చక్కెరతో తయారుచేసిన టీ ఆరోగ్యానికి ఏ విధంగానూ మేలు చేయదు. అటువంటి పరిస్థితిలో, శీతాకాలం వచ్చిన వెంటనే, రోజంతా 5 నుంచి 6 కప్పుల టీ తాగుతుంటారు. ఇవన్నీ శీతాకాలంలో బరువు పెరగడానికి ప్రధాన కారణాలే.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
