మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండేందుకు వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తినేందుకు ఇష్టపడుతున్నారు జనాలు. అయితే కొద్దిరోజుల తర్వాత బ్రౌన్ రైస్ తింటే బోర్ కొడుతుంది. కాబట్టి, బ్రౌన్ రైస్ చేయడానికి ఇక్కడ చాలా సులభమైన, విభిన్నమైన మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రౌన్ రైస్ పులావ్ - వివిధ రకాల మసాలాలు, కూరగాయలతో బ్రౌన్ రైస్ పులావ్ చేసుకోవచ్చు. బీన్స్, పనీర్, చికెన్ లేదా టోఫు వంటి మీకు ఇష్టమైన ప్రోటీన్‌ని జోడించడం ద్వారా దీన్ని సిద్ధం చేయవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని తినొచ్చు.

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

బ్రౌన్ రైస్ ఖిచ్డీ: పెసర పప్పు, పసుపు, సుగంధ ద్రవ్యాలు, క్యారెట్, బఠానీలు, టమోటాలు వంటి కూరగాయలతో బ్రౌన్ రైస్ ఖిచ్డీని తయారు చేయవచ్చు.  
ఫ్రైడ్ రైస్ : తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బఠానీ వంటి వాటితో ఉడికించిన బ్రౌన్ రైస్‌ను తేలికగా వేయించి ఫ్రైడ్ రైస్ చేయవచ్చు. దానికి సోయా సాస్, సుగంధ ద్రవ్యాలు జోడిస్తే మరింత హెల్తీ గా ఉండొచ్చు.

బ్రౌన్ రైస్ సలాడ్:  ఉడికించిన బ్రౌన్ రైస్‌ను తరిగిన కూరగాయలు, గింజలు, సలాడ్ తో కలిపి తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఈ సలాడ్ ను  డిన్నర్‌లో చేర్చుకోవచ్చు.

బియ్యం , బీన్స్ - మెక్సికన్-శైలి వంటకాన్ని రూపొందించడానికి వండిన బీన్స్, మొక్కజొన్న, సలాడ్ పదార్థాలతో బ్రౌన్ రైస్ కలపండి.

బ్రౌన్ రైస్ ఇడ్లీ , దోస,  దోస పిండిలో వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ ఉపయోగించండి. ఇడ్లీ , దోసలను తయారుచేసుకొని తినొచ్చు. 

బ్రౌన్ రైస్ ఖీర్- బ్రౌన్ రైస్ తో స్వీట్ ఖీర్ తయారు చేసుకోవచ్చు. దీనికి పాలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
బ్రౌన్ రైస్ బిర్యానీ:  సాంప్రదాయ బిర్యానీలో వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ ఉపయోగించవచ్చు.

 

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brown-rice brown-rice-flour brown-rice-health-benefits benefits-of-brown-rice benefits-of-brown-rice-for-health brown-rice-benefits health-benefits-of-brown-rice is-brown-rice-healthy top-10-health-benefits-of-brown-rice healthy-benefits-of-brown-rice white-rice-vs-brown-rice benefits-of-eating-brown-rice brown-rice-vs-white-rice the-benefits-of-brown-rice top-benefits-of-brown-rice-for-thyroid-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com