చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించాలంటే..ఏం చేయాలి..?  

షేర్ చేయండి:
చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించాలంటే..ఏం చేయాలి..?  

సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ అనేది నేడు వేగంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య. మంచి ఆరోగ్యం కోసం శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం, కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి మీ ఆహారంలో కొన్నిరకాల మార్పులు చేసుకుంటే, మీరు ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.. అవేంటో తెలుసుకుందాం.. 
 
రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హై డెన్సిటీ లిపోప్రొటీన్)ను మంచి కొలెస్ట్రాల్ అంటారు. శరీరంలోని కణజాలాలను ఏర్పరచడంలో, సరైన రక్త ప్రసరణను నిర్వహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్), ను చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ఇది గుండె ధమనుల్లో పేరుకుపోయి గుండెకు రక్తం చేరే మార్గంలో అడ్డంకిని సృష్టిస్తుంది.  


ఓట్‌మీల్‌.. 

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఓట్‌మీల్‌ చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పీచు చెడుకొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా మొలకెత్తిన ధాన్యాలు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.  

డ్రై ఫ్రూట్స్..

మీరు డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నివారించవచ్చు. డ్రై ఫ్రూట్స్ లో మల్టీవిటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.   వాల్‌నట్‌లు, బాదంపప్పులను తీసుకోవచ్చు. ఐతే బాదంలో అధిక కేలరీలు ఉన్నందున, దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.

అవకాడో..

చెడు కొలెస్ట్రాల్ విషయంలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా సహాయపడతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అవకాడోలో ఉండే పోషకాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఉపకరిస్తాయి.  

ఆకు పచ్చ కూరగాయలు.. 

గ్రీన్ వెజిటేబుల్స్ ను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా ఉంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆకుపచ్చ కూరగాయలు ఎంతగానో పనిచేస్తాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర, టొమాటో మొదలైనవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉత్తమమైనవి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్.. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. ఇవి చేపలలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇది కాకుండా, వెజిటేరియన్ ఫుడ్ విషయంలో   ఆవాలు, అవిసె గింజలు, రాగి, జోవర్, మిల్లెట్, చియా గింజలు తినవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.