విటమిన్‌ డి సప్లిమెంట్లతో జాగ్రత్త!

షేర్ చేయండి:
  విటమిన్‌ డి సప్లిమెంట్లతో జాగ్రత్త!

సాక్షి లైఫ్ : విటమిన్ "డి "శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ను నియంత్రించ డంలో సహాయపడే ముఖ్యమైన విటమిన్. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచడంలో "డి" విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సప్లిమెంట్ల రూపంలో ఈ విటమిన్‌ను అందరూ వేసుకోకూడదా..? ఒకవేళ "డి" విటమిన్ వేసుకు నేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు?  

విటమిన్‌ ‘డి’ని పొందేందుకు ఉన్న అతి సులువైన, చౌక మార్గం సూర్యరశ్మే. అందుకే దీన్ని సన్‌షైన్‌ విటమిన్‌ అని కూడా పిలుస్తూంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల మనకు విటమిన్‌ డి లోపం ఏర్పడుతూంటుంది. దీన్ని అధిగమించేందుకు ఒక వయసు తరువాత సప్లిమెంట్ల అవసరం ఏర్పడుతుంది. అరవై ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు "డి" విటమిన్ లోపానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే వీళ్లలో ఎక్కువగా ఎముకల సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. 

విటమిన్ D2, D3 తో సహా.. 

విటమిన్ D2, D3 తో సహా విటమిన్ "డి " ట్యాబ్లేట్స్ వివిధ రూపాల్లో లభిస్తాయి.  అయితే అవగామన లేకుండా విటమిన్ మాత్రలు వాడకూడదు. విటమిన్స్ రెండు రకాలున్నాయి.  వీటిలో నీళ్లలో కరిగే విటమిన్స్, కొవ్వులొ కరిగే విటమిన్స్ ఉన్నాయి.  

 B1 నుంచి బీ 12 వరకు..  

నీళ్లలో కరిగే బీ కాంప్లెక్స్ ట్యాబ్లేట్స్ లో B1 నుంచి బీ 12 వరకు విటమిన్ ట్యాబ్లేట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ  బీ కాంప్లెక్స్ విటమిన్స్ అని అంటారు. ఇవన్నీ వాటర్ లో కరిగే విటమిన్స్.. విటమిన్ "సి' టాబ్లెట్స్ కూడా నీళ్లలో కరిగిపోతుంది. విటమిన్ "సి' టాబ్లెట్స్, బీ కాంప్లెక్స్ విటమిన్స్ కానీ ఎక్కువగా తీసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
 
దుష్ప్రభావాలు.. 

కొవ్వులొ కరిగే విటమిన్ "ఏ ", "డి ", "ఈ", "కె" , ఇవి నాలుగు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంది.  బీ కాంప్లెక్స్ మాదిరిగా ఈ టాబ్లెట్స్ నీటిలో కరిగి  మూత్రం ద్వారా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. రక్తపరీక్షల అనంతరం "డి" విటమిన్ లోపం ఉందని తేలితేనే డాక్టర్ల సలహా మేరకు వాడాలి.  

 క్యాల్షియం లెవల్స్.. 

 కొవ్వులొ కరిగిన తర్వాత ఈ మాత్రలు శరీరం బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. దీనివల్ల శరీరంలో క్యాల్షియం లెవల్స్ పెరుగుతాయి. ఇలాంటి "డీ"విటమిన్ టాబ్లెట్స్ వాడడం వల్ల కొందరి రక్తంలో 19 శాతం క్యాల్షియం పెరిగి కిడ్నీలు దెబ్బతిని కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది.  

 
అనారోగ్య సమస్యల బారీన పడే ప్రమాదం.. 

 వైద్యుల సలహా తీసుకోకుండా కొన్నిరకాల టాబ్లెట్స్ వాడడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యల బారీన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా "డి" విటమిన్ టాబ్లెట్స్ వాడే సమయంలో ఖచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోవాలి.  లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.. 

ఇది కూడా చదవండి.. విటమిన్ B1లోపంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి..? వాటిని ఎలా అధిగమించాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.