ఒబెసిటీ వల్ల వచ్చే ప్రమాదకర పరిణామాలు ఏమిటి..?

షేర్ చేయండి:
ఒబెసిటీ వల్ల వచ్చే ప్రమాదకర పరిణామాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : చిన్నతనంలో వచ్చే ఊబకాయం పెద్దయ్యాక అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అత్యవసర చర్యలు తీసుకోకపోతే, 2060 నాటికి ఈ సమస్య  2.5శాతానికి పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఊబకాయ సమాఖ్య (World Obesity Federation) అంచనా వేసింది.

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 

ఒబెసిటీ పరిస్థితికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులే అని నివేదిక విశ్లేషించింది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్: చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPFs) వినియోగం విపరీతంగా పెరిగింది. సాంప్రదాయ ఆహారాలైన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు పక్కకు పోయి, ఈ రకం ఆహారాలు మన భోజనంలో భాగమయ్యాయి.

నిశ్చల జీవనశైలి: పెరిగిన స్క్రీన్ టైమ్, శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చుని ఉండటం ఊబకాయానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. వాణిజ్యప్రకటనల ప్రభావం: ముఖ్యంగా సోషల్ మీడియాలో చక్కెర పానీయాలు, జంక్ ఫుడ్స్ కు సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా ఉండటం యువతను ప్రభావితం చేస్తోంది.

 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.