లివర్ ఇన్ఫెక్షన్ ఐతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన కాలేయం ఆరోగ్యకరమైన జీవితానికి చాలా ముఖ్యం. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు కాలేయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. కాలేయ సమస్యలు తెలెత్తే ముందు శరీరంలో దీనికి సంబంధించి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. లివర్ ఇన్ఫెక్షన్ ను ఎలా గుర్తించాలంటే..?   

లివర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు..

ఆకలి లేకపోవడం: శరీరంలో ప్రధానమైంది కాలేయం. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆకలి తగ్గుతుంది. అంతేకాదు ఏమీ తినాలని అనిపించదు. అటువంటి పరిస్థితిలో తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

చర్మంపై దద్దుర్లు: లివర్ ఇన్ఫెక్షన్ వల్ల చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల, మీరు పదేపదే శుభ్రత పాటించినప్పటికీ మీ చర్మంపై దురద, దద్దుర్లు ఏర్పడినట్లయితే, అది  కాలేయ ఇన్ఫెక్షన్ కు సంకేతంగా భావించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

లివర్ ఇన్ఫెక్షన్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది.

కాలేయం దెబ్బతిన్నప్పుడు, రోగికి తక్షణ చికిత్స అవసరం.

ఇన్ఫెక్షన్‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

వాంతులు ,వికారం: కాలేయ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాంతులు అవ్వడమే కాకుండా , వికారంగా  అనిపిస్తుంది. తిన్న ఆహారం, పానీయం జీర్ణం కాకముందే వాంతులు అవుతాయి.  

కడుపు నొప్పి , కడుపు ఉబ్బినట్లు : కాలేయ సమస్య ప్రారంభ దశలో కడుపు నొప్పి , కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. లోపల నుంచి భరించలేని నొప్పి కూడా లివర్ ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుంది.

ఇది కూడా చదవండి.. ఉడికించిన వేరుశెనగగింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.