Cholesterol : కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉన్నా.. గుండె పదిలంగా ఉండాలంటే ఇవి గమనించండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె జబ్బుల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, గుండె ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఆరు నెలలకోసారి వయోజనులు 'లిపిడ్ ప్రొఫైల్' (Lipid Profile) పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. అయితే, ఈ రిపోర్టులో కేవలం 'టోటల్ కొలెస్ట్రాల్'ను మాత్రమే చూసి గుండె సురక్షితంగా ఉందని భ్రమపడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టోటల్ కొలెస్ట్రాల్‌తో పాటు గమనించాల్సినవి..

సాధారణంగా టోటల్ కొలెస్ట్రాల్ 200 mg/dl కంటే తక్కువగా ఉంటే అంతా సవ్యంగా ఉన్నట్లేనని చాలామంది భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) సూచనల ప్రకారం.. గుండె జబ్బుల ముప్పును అంచనా వేయడానికి కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా వయసు, రక్తపోటు (bp), మధుమేహం, ధూమపానం అలవాటు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఎల్డీఎల్ (LDL, (Bad Cholesterol)

రక్తనాళాల గోడలపై కొవ్వు పొరల్లా పేరుకుపోయి, ధమనులను కుచించుకుపోయేలా (atherosclerosis) చేయడంలో ఎల్డీఎల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తీవ్రమవుతుంది. ఆరోగ్యవంతులైన వయోజనుల్లో దీని స్థాయి 100 mg/dl కు లోపు ఉండాలి.

ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides)..

ఇవి శరీరంలో శక్తిని నిల్వ చేసే ఒక రకమైన ఫ్యాట్. రక్తంలో వీటి స్థాయిలు పెరిగితే ఆటోమెటిక్‌గా మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగే ప్రమాదం ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు, నిత్య వ్యాయామంతో ట్రైగ్లిజరైడ్స్‌ను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.

లిపోప్రొటీన్-ఎ (Lipoprotein-a)..

లిపిడ్ ప్రొఫైల్ పరీక్షతో పాటే, వైద్యుల సలహా మేరకు జీవితంలో కనీసం ఒక్కసారైనా 'లిపోప్రొటీన్-ఎ' పరీక్ష చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్య స్థితిగతులను మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చు.ఈ పరీక్షలన్నీ సమగ్రంగా పరిశీలించి, వైద్యుల సూచనల మేరకు జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.