Holding Urine : గంటల కొద్దీ మూత్రం ఆపుకుంటున్నారా..? ఈ హ్యాబిట్ తో ఎన్ని అనారోగ్య సమస్యలో తెలుసా..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పని ఒత్తిడి, ప్రయాణాలు లేదా పరిసరాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడం.. కారణం ఏదైనా చాలామంది మూత్రం (Urine) వస్తున్నా గంటల కొద్దీ ఆపుకుంటుంటారు. అప్పుడప్పుడైతే పర్వాలేదు కానీ, ఇదే అలవాటుగా మారితే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ, బ్లాడర్ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమ త్తంగా ఉండాలి. అసలు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

 

మూత్రం ఆపుకుంటే కలిగే నష్టాలు..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ముప్పు..మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల అందులోని బ్యాక్టీరియా వృద్ధి చెంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ (UTI)కు దారితీస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, దుర్వాసన రావడం, పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటివి దీని ప్రాథమిక లక్షణాలు. మూత్రాశయం (Bladder) కండరాలపై ఒత్తిడి.. తరచూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశ య కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. భవిష్యత్తులో మూత్రాశ యం సహజంగా సంకోచ, వ్యాకోచాలు చెందే సామర్థ్యాన్ని కోల్పోయి, పనితీరు మందగించే ప్రమాదం ఉంది.

మూత్ర విసర్జనలో ఇబ్బందులు..ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే, భవిష్యత్తులో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల ఎప్పుడూ మూత్రం వస్తున్నట్లుగానే అనిపిస్తుంది, తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. పొత్తికడుపులో నొప్పి.. బ్లాడర్ సామర్థ్యానికి మించి నిండిపోయి నప్పుడు పొత్తికడుపు కింది భాగంలో భారం, నొప్పి, ఒత్తిడి కలుగుతాయి. అకస్మాత్తుగా మూత్రం పోయాలన్న తీవ్రమైన భావన కలిగి ఇబ్బంది పెడుతుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

ఈ లక్షణాలు కనిపిస్తే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు.మూత్రంలో రక్తం పడటం.మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంట, నొప్పి.జ్వరంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు రావడం. మూత్రం అస్సలు రాకపోవడం లేదా నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవ డం ఉత్తమం.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మూత్రం వచ్చిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపుకోకుండా విసర్జించడం అలవాటు చేసుకోండి. శరీరానికి సరిపడా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. వయసు, శారీరక శ్రమ, వాతావరణాన్ని బట్టి శరీరానికి నీటి అవసరం మారుతుంది. మీ దాహాన్ని బట్టి తగినంత నీరు తాగండి. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే రోజువారీ నీటిని తీసుకోవాలి.

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.