Prediabetes : ప్రీ-డయాబెటిస్‌ అంటే షుగర్ వచ్చినట్లేనా..? దీనిని రివర్స్ చేయవచ్చా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (diabetes) ముప్పు రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. చిన్న వయసులోనే చాలామంది దీని బారిన పడుతున్నారు. ఒకసారి డయాబెటిస్ మొదలైందంటే దానిని పూర్తిగా నయం చేయడం కష్టమని, కేవలం మందులు, జీవనశైలి మార్పుల తోనే అదుపులో ఉంచుకోవాలని భావిస్తుంటాం. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలు పూర్తిగా డయాబెటిస్ స్థాయికి చేరకుండా, సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే దశనే ‘ప్రీ-డయాబెటిస్’ (Pre-Diabetes) అంటారు. ఇది శరీరమిచ్చే హెచ్చరిక గంట మాత్రమేనని, సమయానికి స్పందిస్తే దీనిని సులభంగా రివర్స్ చేయవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..?

ఈ సమస్య బారిన పడ్డారంటే మీకు అప్పుడే షుగర్ వ్యాధి వచ్చినట్లు కాదని, భవిష్యత్తులో ఆ ముప్పు బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ప్రకృతి ఇచ్చిన చక్కటి అవకాశమని వైద్యులు చెబుతున్నారు.  ప్రీ-డయాబెటిస్ నిర్ధారణ అయిన తొలి 6 నుంచి 12 నెలల కాలం అత్యంత కీలకం. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే జీవితాంతం మధుమేహ బాధితులుగా మారకుండా సురక్షితంగా బయటపడవచ్చు. సరైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే దాదాపు 70 నుంచి 80 శాతం వరకు ప్రీ-డయాబెటిస్‌ను రివర్స్ చేయడం సాధ్యమవుతుంది.

బీటా కణాలు కోలుకునే అవకాశం..

ప్రీ-డయాబెటిస్ దశలో జీవనశైలి మార్పులు చేసుకోకపోతే, ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్‌లోని కణాలు ప్రతిఏటా తమ సామర్థ్యంలో 4-5 శాతాన్ని కోల్పోతుంటాయి. అయితే, ఈ బీటా కణాలు పూర్తిగా నశించిపోవని.. నిరంతరం పని ఒత్తిడి వల్ల అవి కేవలం అలసిపోతాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన ఆహారం, జీవనశైలితో ఆ కణాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చి తమ పనిచేసే సామర్థ్యాన్ని పునరుద్ధరించుకోగలవు.

బరువు తగ్గడమే ప్రధానాస్త్రం..

అధ్యయనాల ప్రకారం, ప్రీ-డయాబెటిస్ సమయంలో తమ శరీర బరువులో 10 నుంచి 15 శాతం వరకు తగ్గించుకున్న వారిలో 86 శాతం మందికి టైప్-2 డయాబెటిస్ ముప్పు గణనీయంగా తగ్గినట్లు తేలింది. బరువు తగ్గడంతో పాటు కాలేయం (Liver), ప్యాంక్రియాస్ చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి శరీరం దానిని మెరుగ్గా స్వీకరిస్తుంది.

నిర్ధారణ అయితే ఏం చేయాలి..?

ఈ సమస్యను గుర్తించిన వెంటనే కొన్ని సులభమైన జీవనశైలి అలవాట్లను పాటిస్తే పెద్ద ప్రమాదాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.రోజువారీ భోజనంలో ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా ముగించడం మంచిది.

12 గంటల విరామం...రాత్రి భోజనానికి, మరుసటి రోజు ఉదయం అల్పాహారానికి మధ్య కనీసం 12 గంటల వ్యవధి (Night Fast) ఉండేలా చూసుకోవాలి. రోజూ నడక.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 15 నిమిషాల పాటు నడక (Fast Walk) దినచర్యలో భాగం చేసుకోవాలి.తగినంత నిద్ర.. శరీర బరువు తగ్గడంలో, హార్మోన్ల సమతుల్యతలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల గాఢమైన నిద్రకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.