Avocado Health benefits : ఆరోగ్యానికి 'గుడ్ ఫ్యాట్'.. అవకాడోతో అద్భుత ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : కొవ్వు (fat) అనగానే బరువు పెరుగుతారని, అనారోగ్యాలు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. కానీ, శరీరానికి మేలు చేసే కొవ్వులు కూడా ఉంటాయి. అందులో 'మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్' ఒకటి. ఇది గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్, బాదం, వేరుశెనగల్లో లభించే ఈ 'గుడ్ ఫ్యాట్'.. అవకాడో (Avocado) పండులో మెండుగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
అవకాడో అందించే ప్రయోజనాలు..
గుండెకు రక్షణ..
అవకాడో లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) సమర్థవంతంగా తగ్గిస్తాయి. తద్వారా రక్తనాళాల్లో పూడికలు (ప్లాక్) ఏర్పడకుండా నిరోధించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
మానసిక ఆరోగ్యం..
అవకాడోలో ఫోలేట్ (Folate) అధికంగా ఉంటుంది. ఇది మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఫోలేట్ లోపం వల్ల వచ్చే డిప్రెషన్ (depression) వంటి మానసిక సమస్యలను దూరం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోని ఫైబర్ (fiber) జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి అనారోగ్యకరమైన స్నాక్స్ తినకుండా ఇది అడ్డుకుంటుంది. బరువు నియంత్రణలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు..
కంటి ఆరోగ్యానికి..అవకాడోలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress) నుంచి కళ్లను రక్షించి, చూపు మందగించకుండా కాపాడతాయి. కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థం మాత్రమే కాకుండా.. విటమిన్-ఇ, పొటాషియం, ఐరన్, కాపర్ వంటి ఎన్నో ఖనిజాలు, విటమిన్లు ఒకే పండు ద్వారా శరీరానికి అందుతాయి. నిత్యం తీసుకునే సమతుల్య ఆహారంలో అవకాడోను కూడా ఒక భాగంగా చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంతో పాటు సంపూర్ణ శారీరక, మానసిక ఉల్లాసాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
