సాక్షి లైఫ్ : నెయ్యి తింటే మీ బరువు పెరుగుతుందని, ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీరు అపోహ పడుతున్నారా? అయితే ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తప్పనిసరిగా మీరూ కూడా తెలుసుకోవాలి.. నిజానికి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో అనేక ఆరోగ్య గుణాలున్నాయి. ముఖ్యంగా ఆవు నెయ్యిని గోరువెచ్చని నీటితో కలిపి తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?
నెయ్యి దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. వేడి వేడి అన్నంలో పప్పు, మామిడికాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. రుచికి తగినట్లుగానే ఇందులో అద్భుతమైన పోషకాలున్నాయి. ఇది ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిగణిస్తారు. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుండడమే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
అయితే మీరు ఎప్పుడైనా నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగారా? నిజానికి, గోరువెచ్చని నీటిలో గోరువెచ్చని నీటితో నెయ్యి కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆవు నెయ్యి వేడి నీటిలో కలిపి తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటే..?
రోగనిరోధక శక్తి..
ఆవు నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం..
ఆవు నెయ్యిలో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, యవ్వనంగా ఉంచడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం..
ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్లలో నెయ్యి వేసుకుని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవు నెయ్యిలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మెదడు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
జీర్ణశక్తి..
ఆవు నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రేగులలో కనిపించే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే, ఇది మంటను తగ్గిస్తుంది. దీని కారణంగా జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంటుంది.
శరీర నిర్విషీకరణ..
ఆవు నెయ్యిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను తొలగించి, శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచి, మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
జీవక్రియ..
ఆవు నెయ్యి శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శక్తిని సరిగ్గా వినియోగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు కూడా తగ్గవచ్చు.
కీళ్ల నొప్పులు..
ఆవు నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కీళ్లకు మేలు చేస్తాయి. కాబట్టి నెయ్యి వినియోగం కీళ్ల నొప్పులను తగ్గించడమేకాకుండా, వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మనస్సు ప్రశాంతంగా ..
ఆవు నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. తద్వారా మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com