Hair Loss Treatment : హెయిర్ లాస్ ట్రీట్మెంట్ అందరికీ ఒకేలా ఎందుకు పనిచేయదు కారణాలు ఏంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జుట్టు రాలడం అనేది ప్రస్తుత రోజుల్లో సర్వసాధా రణ సమస్యగా మారింది, అయితే ఒకరికి మంచి ఫలితాలు ఇచ్చిన చికిత్స మరొకరిపై అదే స్థాయిలో పనిచేయదు. దీనికి ప్రధాన కారణం ప్రతి వ్యక్తి కేశమూలాల (hair follicles) జీవక్రియలు, వారి శరీర స్వభావం వేర్వేరుగా ఉండటమేనని డాక్టర్లు వివరిస్తున్నారు.

హెయిర్ ఫాలికిల్స్ పాత్ర(hair follicles)..

కేశమూలం అనేది కేవలం జుట్టును పెంచే ఒక అవయవం మాత్రమే కాదు. ఇందులో ఎన్నో రకాల కణాలు, సంక్లిష్టమైన జీవక్రియలు ఇమిడి ఉంటాయి. ఒక వ్యక్తి వయసు, హార్మోన్ల స్థాయి, ఫాలికిల్ చుట్టూ ఉండే వాతావరణంపై చికిత్స ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంటుంది కాబట్టే రిజల్ట్స్ కూడా మారుతుంటాయి.

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

పీఆర్‌పీ (PRP) చికిత్సలోనూ అంతే..

జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు అత్యధికంగా వాడే ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) విధానంలో శరీరంలోని ప్లేట్‌లెట్స్‌ను ఉపయోగిస్తారు. రోగి హెయిర్ ఫాలికిల్ పరిస్థితి, దాని చుట్టూ ఉండే జీవక్రియల వాతావరణాన్ని బట్టి మాత్రమే పీఆర్‌పీ చికిత్స ప్రతిస్పందిస్తుంది. కాబట్టి అందరిలోనూ ఇది ఒకేలా పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు.

చికిత్సను ప్రభావితం చేసే ఇతర కారణాలు..

హార్మోన్లు, జన్యువులు.. హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్య సమస్యలు జుట్టు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వయసు పైబడటం కూడా దీనికి ఒక కారణం. పోషకాహార లోపం..శరీరంలో ఐరన్, ప్రొటీన్లు, ఇతర ముఖ్యమైన విటమిన్ల లోపం ఉన్నప్పుడు ఎంత ఖరీదైన చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఒత్తిడి, జీవనశైలి..తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అస్తవ్యస్తమైన జీవనశైలి జుట్టు రాలే సమస్యను మరింత జటిలం చేస్తాయి. కేవలం ట్రీట్‌మెంట్స్‌పై ఆధారపడకుండా ఆహారం, నిద్రపై కూడా దృష్టి పెట్టాలి.

పక్కింటి వారికో,బంధువులకో, స్నేహితులకో జుట్టు పెరిగిందని వారు వాడిన మందులు, చికిత్సలను గుడ్డిగా అనుసరించకూడదు. ముందుగా జుట్టు ఎందుకు రాలుతుందో కారణాలను విశ్లేషించుకోవాలి. చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, మీ కేశమూలాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే మీకు సరిపోయే పీఆర్‌పీ లేదా ఇతర మందులను ఎంచుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.