Monsoon Workouts : వర్షాకాలంలో వర్కవుట్ చేసేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలంలో అవుట్‌డోర్ వర్కవుట్లు, ఆటల సమయంలో గాయాల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తడిసిన, జారే రోడ్లపై అజాగ్రత్తగా నడిచినా లేదా పడిపోయినా కండరాలు పట్టేయడం (Sprain) లేదా ఎముక విరిగే (Fracture) ప్రమాదంఉంటుంది. వర్షాకాలం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. కానీ ఈ సమయంలో రన్నింగ్, సైక్లింగ్, అవుట్‌డోర్ స్పోర్ట్స్ వంటి వ్యాయామాలు చేసేవారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. తడి రోడ్లు, జారే మార్గాలు, బురద, గుంతల కారణంగా కిందపడి గాయపడే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ఈ చిన్నపాటి జారే స్వభావం కారణంగానే శరీర సమతుల్యత (Balance) దెబ్బతింటుంది. ఇది బెణుకులు, లిగామెంట్ గాయాలు లేదా ఫ్రాక్చర్‌లకు దారితీస్తుంది. కాబట్టి ఈ కాలంలో వ్యాయామాలు చేసేటప్పుడు గాయాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. వర్షాకాలంలో ప్రమాదాలను నివారించడానికి కొన్ని కీలకమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.

వ్యాయామానికి ముందు నేలను పరిశీలించండి..

వర్షం తర్వాత జారిపడకుండా ఉండటానికి ఉత్తమ మార్గం.. వర్కవుట్ ప్రారంభించే ముందు ఆ ప్రాంతాన్ని ఒకసారి సరిగ్గా చెక్ చేయడం. మైదానంలో నీరు నిలిచిపోయినా, బురదగా ఉన్నా, లేదా దారి జారేలా ఉన్నా అక్కడ ఎలాంటి ఆటలు లేదా వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. ఇటువంటి ప్రదేశాలలో పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో పాటు కండరాలు, కీళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది.

సరైన రకం బూట్లు ఎంచుకోవడం చాలా ముఖ్యం.. 

వర్షాకాలంలో నేలపై పట్టు (Grip) కోల్పోకుండా ఉండటానికి సరైన బూట్లు ధరించడం తప్పనిసరి. మంచి పట్టు, కుషనింగ్, సపోర్ట్ ఉన్న షూస్ కిందపడిపో కుండా కాపాడతాయి. మీ బూట్ల సోల్స్ అరిగిపోయి ఉంటే, ఈ వర్షాకాలంలో వాటిని వేసుకొని బయటికి వెళ్లకండి. అలాగే, తడిసిన బూట్లను పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే మళ్లీ వేసుకోవాలి. తడిసినవి, సరిగ్గా సరిపోని బూట్ల వల్ల కాళ్ళలో పొక్కులు రావడంతో పాటు శరీర సమతుల్యత కూడా దెబ్బతింటుంది.

వార్మ్ అప్ చేయడం అస్సలు మరువకండి..

వాతావరణంలో ఉండే తేమ లేదా బద్ధకం కారణంగా చాలామంది ఎలాంటి వార్మ్-అప్ చేయకుండానే నేరుగా వర్కవుట్ మొదలు పెట్టేస్తుంటారు. కానీ ఈ పొరపాటు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. వ్యాయామానికి ముందు చేసే తేలికపాటి కదలికలు మీ కండరాలను వర్కవుట్‌కు సిద్ధం చేస్తాయి.

 ముఖ్యంగా చాలా విరామం తర్వాత మళ్లీ వ్యాయామాలు ప్రారంభిస్తున్నప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎలాంటి సన్నాహక వ్యాయామాలు లేకుండా సడన్‌గా వర్కవుట్ మొదలుపెడితే బాడీ బ్యాలెన్స్ తప్పుతుంది. దీనివల్ల గాయాలయ్యే లేదా కండరాలు పట్టిపోయే ముప్పు పెరుగుతుంది.

నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు..

వర్షాకాలంలో జారిపడిన తర్వాత మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే, దానిని తేలికగా తీసుకోవద్దు. సాధారణ నొప్పులైతే విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ వాపు ఎక్కువగా ఉండి, నడవడానికి ఇబ్బందిగా అనిపించినా లేదా చర్మం నీలం రంగులోకి మారినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించడం ద్వారా లిగామెంట్ ట్రియర్స్ లేదా ఫ్రాక్చర్స్ వంటి తీవ్రమైన సమస్యలకు సరైన చికిత్స అందించవచ్చు.

వాతావరణానికి తగినట్లుగా పద్ధతులు మార్చుకోండి..

వర్షాకాలం వచ్చిందంటే వర్కవుట్ చేయడం పూర్తిగా మానేయాలని అర్థం కాదు. శరీర స్టామినా, ఫిట్‌నెస్, కదలికలు సక్రమంగా ఉండటానికి శారీరకంగా చురుగ్గా ఉండటం చాలా అవసరం. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఈ వర్షాకాలంలోనూ మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.