Silent Diseases : నిశ్శబ్దంగా దాడి చేసే వ్యాధులను గురించి మీకు తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సన్నగా, చురుగ్గా కనిపించే వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు; పైకి ఫిట్‌గా కనిపించినా శరీరంలో పలు నిశ్శబ్ద వ్యాధులు (Silent diseases) వృద్ధి చెందుతుండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం బరువు సాధారణంగా ఉండి, రోజువారీ పనులు సులభంగా చేసుకోగలిగినంత మాత్రాన లోపల అవయవాలు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించలేము.

నిశ్శబ్దంగా దాడి చేసే వ్యాధులు..

కొన్ని రకాల వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను బయటపడనివ్వవు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే తప్ప వీటిని గుర్తించడం కష్టం. అధిక రక్తపోటు (High BP)..దీన్ని 'సైలెంట్ కిల్లర్' అంటారు. ధమనుల్లో రక్తపోటు పెరిగినా చాలా కాలం వరకు ఎలాంటి లక్షణాలు కని పించవు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్య కారణాల వల్ల సన్నగా ఉన్నవారిలోనూ బీపీ పెరగొచ్చు. దీనివల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, కళ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

 

ఇది కూడా చదవండి..Ferritin Face : 'ఫెర్రిటిన్ ఫేస్' అంటే ఏమిటి..? ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..ICMR’s New Dietary Guidelines : ఐదు నుంచి 18 ఏళ్ల వారు ఏం తినాలి..? ICMR కొత్త మార్గదర్శకాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

మధుమేహం (Diabetes)..

 ప్రీ-డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ సమస్యలు ఉన్నా పైకి మామూలుగానే కనిపిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అది మధుమేహం స్థాయికి చేరే వరకు ఎలాంటి సంకేతాలు ఉండవు. రక్త పరీక్షల ద్వారా మాత్రమే దీనిని గుర్తించగలం.

ఫ్యాటీ లివర్ (MASLD)..

కాలేయంలో పరిమితికి మించి కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. అధిక బరువు ఉన్నవారితో పాటు రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువ. ఇది కూడా చాలా కాలం పాటు ఎలాంటి ఇబ్బందినీ కలిగించదు.

కిడ్నీ వ్యాధులు (Kidney Issues)..

 దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ప్రారంభ దశలో అలసట, నొప్పులు, మూత్ర విసర్జనలో మార్పులు వంటివి కనిపించినా, చాలామంది వాటిని వాతావరణ మార్పులని లేదా సాధారణ అలసట అని నిర్లక్ష్యం చేస్తారు.

వ్యాధి నిర్ధారణ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అధిక రక్తపోటు: రక్తపోటును గుర్తించడానికి క్రమం తప్పకుండా బీపీ మానిటరింగ్ చేసుకోవడం అత్యవసరం. ముఖ్యంగా ఆహారంలో ఉప్పు మోతాదుకు మించి తీసుకునేవారికి, ఎలాంటి శారీరక వ్యాయామం చేయకుండా ఒకేచోట కూర్చుని పనిచేసే వారికి ఈ వ్యాధి ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది.

మధుమేహం (Diabetes:)..

 ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c వంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, ఆహారపు అలవాట్లు,జీవనశైలి సరిగ్గా లేని వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువ.

కొలెస్ట్రాల్, గుండె జబ్బులు..

 రక్తంలో పేరుకుపోయిన కొవ్వును, గుండెకు పొంచి ఉన్న ముప్పును పసిగట్టడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎంతో అవసరం. నూనెతో చేసిన పదార్థాలు, బయట దొరికే జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

కిడ్నీ, లివర్ సమస్యలు..

 మూత్రపిండాలు, కాలేయ సమస్యల నిర్ధారణ కోసం సీరమ్ క్రియాటినిన్, ఎల్.ఎఫ్.టి (LFT) వంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మధుమేహం, అధిక రక్తపోటు అదుపులో లేని వారిలో ఈ అవయవాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ.

 

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.