Thalassemia : తలసేమియా విషయంలో జన్యు లోపాలపై ముందస్తు పరీక్షలే కీలకం..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మత 'తలసేమియా'పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రతి ఏటా మే 8వ తేదీని ప్రపంచ తలసేమియా దినోత్సవంగా పాటిస్తారు. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి ప్రక్రియ దెబ్బతినడం వల్ల తలెత్తే ఈ సమస్య, సరైన అవగాహన లేకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్  బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!

 

ఏమిటీ తలసేమియా..?

శరీరం అంతటా ఆక్సిజన్‌ను మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి కాకపోవడమే తలసేమియా. ఇది పూర్తిగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారికి తరచుగా రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. అవగాహన లోపంతో చాలామంది ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారని, ఫలితంగా చికిత్స ఆలస్యమవుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తలసేమియా లక్షణాలు ఎలా ఉంటాయంటే..? 

వ్యాధి తీవ్రతను బట్టి రోగుల్లో పలు లక్షణాలు కనిపిస్తాయి.

నిరంతర బలహీనత, విపరీతమైన అలసట.

చర్మం, ముఖం పాలిపోవడం.

పిల్లల్లో శారీరక ఎదుగుదల మందగించడం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ తల తిరగడం.

ప్లీహం (Spleen) వాపు లేదా ఎముకల్లో బలహీనత.

అవగాహనే అసలైన చికిత్స.. 

తలసేమియా మహమ్మారిని అరికట్టడానికి వివాహానికి ముందే దంపతులు రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ జరిగి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాధితులు మెరుగైన జీవనం గడిపే అవకాశం ఉంటుంది.

తలసేమియా డే 2026 థీమ్..

తలసేమియా ఉండి కూడా లక్షణాలు బయటపడక, వ్యాధి నిర్ధారణ కాని లక్షలాది మందిని గుర్తించి, వారికి సరైన వైద్య సాయం అందించడమే ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. అందరికీ సమానంగా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది.

 

ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.