Palm Oil Health Risk : పామాయిల్‌తో ప్రాణాలకే ముప్పు.. గుండెపోటుకు ప్రధాన కారణం ఇదేనా..?
సాక్షి లైఫ్ : కరోనా తదనంతర కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు (heart attacks) బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇందుకు కరోనా వైరస్ ప్రభావంతో పాటు, మనం నిత్యం తీసుకునే ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్‌లో వాడే 'పామాయిల్' ప్రధాన కారణమని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నిత్యం మనం తినే బిస్కెట్లు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా శరీరంలోకి చేరుతున్న పామాయిల్.. మద్యం, ధూమపానం కంటే నెమ్మదిగా, అంతే తీవ్రంగా ప్రాణాలను హరిస్తోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ధర తక్కువ.. ముప్పు ఎక్కువ..!
ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. పామ్ చెట్ల నుంచి ఉత్పత్తి ఎక్కువగా రావడం, ఇతర నూనెలతో పోలిస్తే ధర చాలా తక్కువగా ఉండటంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో దీనినే విరివిగా వాడుతున్నారు.
బహుళజాతి కంపెనీల మాయాజాలం..
ప్రముఖ బ్రాండ్ల చిప్స్, బిస్కెట్లు, కుకీలు, చాక్లెట్ల తయారీలో 100 శాతం పామాయిల్‌నే ఉపయోగిస్తున్నారు. విదేశాల్లో కఠినమైన ఆహార చట్టాల వల్ల పామాయిల్ వాడకాన్ని నిలిపివేసిన కొన్ని అంతర్జాతీయ సంస్థలు, మనదేశంలో మాత్రం తమ ఉత్పత్తుల తయారీకి దీనినే వినియోగించడం గమనార్హం.
శరీరంలో ఏం జరుగుతుంది..?
పామాయిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి వైద్యులు వివరించారు. అవేంటంటే..? పాల్మిటిక్ యాసిడ్ ప్రమాదం.. పామాయిల్‌లో ఉండే 'పాల్మిటిక్ యాసిడ్' శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుంది. మిగిలిన నూనెలతో పోలిస్తే ఇందులో ఏకంగా 34 శాతం వరకు సంతృప్త కొవ్వు అంటే ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇది ఆలివ్ ఆయిల్ కంటే రెట్టింపు. మితిమీరిన క్యాలరీలు.. ఈ నూనెలో క్యాలరీలు చాలా ఎక్కువ. తగిన శారీరక శ్రమ లేకపోవడంతో ఇవి శరీరంలో పేరుకుపోయి ఊబకాయంగా మారుతాయి.
మెదడుపై ప్రభావం..
పామాయిల్‌తో చేసిన జంక్ ఫుడ్స్ పిల్లల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతేకాదు, ఇవి ఆకలిని విపరీతంగా పెంచి, వాటికి బానిసలుగా మారుస్తాయి.
ప్రధానికి లక్ష మంది వైద్యుల లేఖ..
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో సగానికి పైగా మధుమేహం, గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయి. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది వైద్యులు గౌరవ ప్రధానికి లేఖ రాయడం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
చిన్న వయసులోనే పలు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే పామాయిల్ వినియోగాన్ని వెంటనే తగ్గించాలి.
గుండె సంబంధిత సమస్యలు..రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం..
చిన్న వయసులోనే టైప్-2 డయాబెటిస్
అధిక బరువు, ఊబకాయం
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ కోసం ప్రయత్నించే వారు పామాయిల్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. హోటల్ ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్‌ను తగ్గించి, ఇంట్లో వండిన పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఆరోగ్యానికి రక్ష.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి
