Swollen Feet : పాదాల వాపులా..? అయితే అస్సలు లైట్ తీసుకోవద్దు.. గుండె, కిడ్నీల ముప్పు కావచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా రోజంతా ఎక్కువగా నడవడం వల్లో లేదా ప్రయాణాలు చేయడం వల్లో కాళ్లు, పాదాలు వాపు రావడం సహజం. చాలా మంది దీనిని అలసటగా భావించి తేలికగా తీసుకుంటారు. కానీ, తరచుగా లేదా నిరంతరాయంగా పాదాలలో వాపులు రావడం అంతర్లీనంగా ఉన్న ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు తొలి సంకేతం కావచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వాపులు గుండె లేదా మూత్రపిండాల పనితీరు మందగించడానికి సూచిక కావచ్చు.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

కిడ్నీల సమస్య వల్ల వాపులు ఎందుకు వస్తాయి..?

మన శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థాలు, అదనపు నీరు, సోడియంను మూత్రం రూపంలో ఇవి బయటకు పంపుతాయి. కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు, శరీరం నుంచి అదనపు ఉప్పు, నీరు సరిగ్గా విసర్జించబడవు. దీనివల్ల కణజాలాలలో ద్రవాలు పేరుకుపోయి పాదాలు, చీలమండలు, కాలివేళ్లు వాపునకు గురవుతాయి. వైద్య పరిభాషలో దీనిని 'ఎడీమా' (Edema) అంటారు. పాదాల వాపుతో పాటు మూత్ర విసర్జన తగ్గడం, మూత్రంలో నురగ రావడం, అధిక రక్తపోటు (B.P), ముఖం ఉబ్బినట్లు అవ్వడం,తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.

గుండె జబ్బులకు సంకేతం కావచ్చు..!

పాదాలలో వాపు రావడానికి గుండె జబ్బులు కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, సిరల్లో (Veins) రక్తం, ద్రవాల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా రక్తనాళాల నుంచి ద్రవం పక్కనే ఉన్న కణజాలాల్లోకి చేరుతుంది. గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఈ ద్రవాలన్నీ కాళ్లు, చీలమండల భాగాల్లో చేరి వాపుగా మారుతాయి.
 కొద్ది దూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రి పడుకున్నప్పుడు ఊపిరాడనట్లు అనిపించడం, విపరీతమైన నీరసం వంటివి గుండె జబ్బుల ప్రధాన లక్షణాలు.

ప్రతి వాపూ ప్రమాదకరం కాదు.. కానీ..!

పాదాల వాపులన్నీ తీవ్రమైన రోగాలకు సంకేతాలు కాకపోవచ్చు. ఎక్కువ సేపు ఒకే చోట నిలబడటం, కూర్చోవడం, గర్భధారణ సమయం, కొన్ని రకాల మందుల వాడకం లేదా నరాల బలహీనత వల్ల కూడా కాళ్లలో వాపులు రావచ్చు. అయినప్పటికీ, వీటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా ముందస్తుగా ముప్పును నివారించవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

ఒకటి లేదా రెండు రోజుల్లో వాపు తగ్గకుండా క్రమంగా పెరుగుతు న్నప్పుడు. కేవలం ఒకే కాలు అకస్మాత్తుగా వాచి, నొప్పితో పాటు ఎర్రగా మారి వేడిగా అనిపిస్తే.. అది 'డీప్ వెయిన్ థ్రాంబోసిస్' అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం కావచ్చు. గర్భధారణ సమయంలో అకస్మాత్తుగా కాళ్ల వాపులతో పాటు తలనొప్పి, కంటిచూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి. మీ పాదాలలో తరచుగా వాపులు కనిపిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే నమ్మకమైన వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. ముందుగా గుర్తించడమే మీ ఆరోగ్యానికి రక్షణ కవచం.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.