Kidney Disease : కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా నేడు మూత్రపిండాల (Kidney problems) సమస్యలు నిశ్శబ్దంగా దాడి చేస్తున్నాయి. వయసు పైబడటం వల్ల లేదా పని ఒత్తిడి వల్ల వచ్చే సాధారణ సమస్యలే కదా అని కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

తీవ్రమైన అలసట, నీరసం..

కిడ్నీల పనితీరు మందగించినప్పుడు దేహంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి, రక్తహీనత (anemia) ఏర్పడుతుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని నీరసాన్ని కేవలం వయసు సమస్యగా కొట్టిపారేయకూడదు.

 

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

 

కాళ్లు, ముఖంపై వాపులు..

శరీరంలోని అదనపు నీటిని, వ్యర్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపడం కిడ్నీల ప్రధాన విధి. అవి సరిగ్గా పనిచేయనప్పుడు ఆ ద్రవాలు దేహంలోనే నిలిచిపోయి పాదాలు, చీలమండలు, ముఖంపై వాపులు వస్తాయి. ఇది కేవలం ఎక్కువసేపు నిలబడటం వల్ల వచ్చిన వాపు అని నిర్లక్ష్యం చేయరాదు.

మూత్ర విసర్జనలో మార్పులు..

రాత్రి పూట తరచుగా మూత్రానికి లేవాల్సి రావడం, మూత్రం రంగు మారడం లేదా అసాధారణ మార్పులు కనిపించడం కిడ్నీ సమస్యలకు సంకేతాలు. మూత్రం సాధారణంగానే వస్తోంది కదా అని కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయని భ్రమపడకూడదు.

ఆకలి మందగించడం, వికారం..

శరీరంలో వ్యర్థాలు (toxins) అధికంగా పెరిగిపోవడం వల్ల ఆకలి నశించడం, వాంతులు అయ్యేలా అనిపించడం వంటి ఉదర సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

మూత్రపిండాల సామర్థ్యం క్షీణించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన అదనపు ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీ వ్యాధుల్లో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడం అనేది అతిపెద్ద సవాలు. కాబట్టి, దీర్ఘకాలికంగా మధుమేహం, హై బీపీ సమస్యలతో బాధపడేవారు కేవలం దేహంలో కనిపించే లక్షణాల కోసం ఎదురుచూడకుండా, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.