Weight : బరువు పెరుగుతున్నారా..? ఈ 4 కారణాలు కూడా కావొచ్చు..!
సాక్షి లైఫ్ : బరువు పెరగడానికి కేవలం అతిగా తినడం లేదా వ్యాయామం చేయకపోవడమే కారణం అని చాలామంది భావిస్తుంటారు. అయితే, అనూహ్యంగా బరువు పెరగడం వెనుక మన దైనందిన అలవాట్లతో పాటు శరీరంలోని కొన్ని అంతర్గత మార్పులు కూడా కారణం కావొచ్చు. సరైన కారణం తెలుసుకోకుండా కేవలం ఆహారం తగ్గించేస్తే ప్రయోజనం శూన్యం.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
బరువు పెరగడం వెనుక దాగి ఉండే ప్రధాన కారణాలు..?
థైరాయిడ్ లోపాలు.. శరీర జీవక్రియలను (metabolism) నియంత్రించే థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు (hypothyroidism) బరువు అమాంతం పెరుగుతారు. దీనితో పాటు తీవ్రమైన అలసట, చలిగా అనిపించడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం వంటివి కనిపిస్తాయి.
దీర్ఘకాలిక ఒత్తిడి (Stress).. నిరంతరం మానసిక ఒత్తిడితో బాధపడేవారిలో ప్రవర్తనాపరమైన, శారీరక మార్పులు వస్తాయి. ఒత్తిడి వల్ల ఎక్కువ క్యాలరీలు, తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. దీనికి నిద్రలేమి కూడా తోడైతే శరీర బరువు మరింత వేగంగా పెరుగుతుంది.
మందుల దుష్ప్రభావం..
కొన్ని రకాల స్టెరాయిడ్స్, మానసిక సమస్యలకు వాడే మందుల వాడకం వల్ల కూడా దుష్ప్రభావంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, బరువు పెరుగుతున్నామనే భయంతో వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందులు వాడటం ఆపేయకూడదు.
మహిళల్లో పీసీఓఎస్ (PCOS)..మహిళల్లో బరువు పెరగడానికి ‘పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్’ అనే హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక ముఖ్య కారణం. బరువు పెరగడంతో పాటు నెలసరి సరిగా రాకపోవడం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు రావడం దీని ప్రధాన లక్షణాలు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
కారణం లేకుండా బరువు అనూహ్యంగా పెరుగుతూ.. తీవ్రమైన అలసట, ఆయాసం రావడం, కాళ్లలో వాపులు లేదా నెలసరిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి, సరైన పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
