Hair Dye side effects : హెయిర్ డై వాడుతున్నారా..? కళ్లకు ఎంత ప్రమాదమో తెలుసా..?
సాక్షి లైఫ్ : తెల్ల జుట్టును కప్పిపుచ్చుకోవడానికో లేదా కొత్త లుక్ కోసమో హెయిర్ డై (Hair Dye) వాడటం నేటి రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే, జుట్టుకు వేసే ఈ రంగుల వల్ల కళ్లకు ఎంత ప్రమాదం ఉందో ఎప్పుడైనా ఆలోచించారా..? హెయిర్ డైలో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు చర్మంతో పాటు కళ్ల చుట్టూ మంట, అలెర్జీకి దారితీస్తాయి. పొరపాటున కళ్లలో పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
1. కళ్లకు ఎందుకు ప్రమాదకరం..?
హెయిర్ డైలలో రకరకాల రసాయనాలను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా శాశ్వత (Permanent) హెయిర్ డైలలో ఉండే పారాఫెనిలిన్ డైఅమైన్ (PPD) అనే రసాయనం అలెర్జీలకు కారణమవుతుంది. కళ్ల చుట్టూ ఉండే చర్మం అత్యంత సున్నితంగా ఉండటం వల్ల త్వరగా ప్రభావితం అవుతుంది. ఈ రసాయనం నేరుగా కంటిలో పడితే కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, తీవ్రమైన మంట, నొప్పి రావడం జరుగుతుంది. కొన్ని తీవ్రమైన కేసుల్లో కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
2. కళ్లలో పడితే తక్షణమే ఏం చేయాలి..?
హెయిర్ డై పొరపాటున కళ్లలో పడితే ఏమాత్రం కంగారు పడకుండా పలు చర్యలు తీసుకోవాలి. అవేంటంటే..?
వెంటనే శుభ్రమైన, చల్లటి నీటితో కళ్లను ధారగా కడుక్కోవాలి.కళ్లను చేతులతో అసలు రుద్దకూడదు. అలా చేస్తే రసాయనం కంటి లోపలి పొరలను మరింత దెబ్బతీస్తుంది.మీరు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నట్లయితే వెంటనే వాటిని తీసేయాలి.
3. రంగు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
హెయిర్ డై వల్ల వచ్చే అలెర్జీ అంటే దురద, వాపు కేవలం కళ్లకే పరిమితం కాకుండా ముఖం, మెడకు కూడా వ్యాపించవచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
డైని కళ్లకు అతి దగ్గరగా, కనుబొమ్మలకు (Eyebrows), కనురెప్పలకు (Eyelashes) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
ప్యాకెట్ పై తయారీదారులు సూచించిన సమయం కంటే ఎక్కువ సేపు రంగును ఉంచుకోకూడదు.
రంగు వేసుకునేటప్పుడు కళ్లను తాకరాదు. వాడిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
గతంలో ఏదైనా డై పడకపోతే, చర్మ నిపుణుల సలహా లేకుండా దాన్ని మళ్లీ వాడొద్దు.
4. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
కళ్లలో డై పడిన తర్వాత కళ్లను నీటితో శుభ్రం చేసినప్పటికీ.. నిరంతరంగా నొప్పిగా ఉండటం, మసకబారడం, వెలుతురును చూడలేకపోవడం లేదా విపరీతంగా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణ మంటగా భావించకుండా తక్షణమే నేత్ర వైద్యుడిని (Eye Specialist) సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
