Buying Medicines : మెడిసిన్స్ కొంటున్నారా..? ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి..!
సాక్షి లైఫ్ : చిన్నపాటి తలనొప్పి వచ్చినా, తీవ్రమైన రుగ్మత ఎదురైనా నేటి రోజుల్లో మెడికల్ షాపునకు వెళ్లడమో లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడమో సర్వసాధారణమైపోయింది. అయితే, ఔషధాల కొనుగోలులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ముప్పుంది. ఆఫ్ లైన్ లేదా ఈ-ఫార్మసీల ద్వారా మందులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన 10 సూచనలు..
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
1. సొంత వైద్యం వద్దు.. ప్రిస్క్రిప్షన్ ముద్దు..
లక్షణాలను బట్టి స్వయంగా మందుల దుకాణానికి వెళ్లి ఔషధాలు కొనుగోలు చేసే అలవాటు (Self-medication) మంచిది కాదు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు, తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులను అర్హత కలిగిన వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోవాలి.
2. గడువు తేదీ (Expiry Date) నిశితంగా పరిశీలించండి..
ఏ ఔషధమైనా కొనుగోలు చేసే ముందు స్ట్రిప్ లేదా సీసాపై ఉన్న తయారీ తేదీ (Mfg Date), గడువు ముగింపు తేదీ (Expiry Date)ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. గడువు తీరిన మందులు పనిచేయకపోగా, విషతుల్యంగా మారి శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
3. ప్యాకేజింగ్, సీల్ నాణ్యతను తనిఖీ చేయండి..
మందుల ప్యాకింగ్ చిరిగిపోయినా, సీల్ తెరిచి ఉన్నా లేదా దెబ్బతిన్నా వాటిని అస్సలు స్వీకరించవద్దు. మాత్రల రంగు మారినా, పొడి రాలినా, ద్రవ రూపంలో ఉండే మందుల వాసనలో తేడా కనిపించినా వెంటనే ఫార్మసిస్ట్ దృష్టికి తీసుకెళ్లాలి.
4. మందు పేరు, మోతాదు (Dosage) సరిచూసుకోండి..
వైద్యులు రాసిన మందు పేరు, స్ట్రిప్‌పై ఉన్న పేరు ఒక్కటేనా కాదా అని అక్షరక్రమం (Spelling) సహా సరిచూసుకోవాలి. అలాగే డోసేజ్ (ఉదాహరణకు 250mg, 500mg) ప్రిస్క్రిప్షన్‌కు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
5. ఆన్‌లైన్ కొనుగోళ్లలో అప్రమత్తత..
ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేసేటప్పుడు గుర్తింపు పొందిన, లైసెన్స్ కలిగిన విశ్వసనీయ ఈ-ఫార్మసీలనే ఎంచుకోవాలి. డెలివరీ వచ్చిన వెంటనే ప్యాకింగ్, బిల్లు, ఎక్స్‌పైరీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
6. డిస్కౌంట్లను చూసి మోసపోవద్దు..
తక్కువ ధరకు లభిస్తున్నాయనో, భారీ ఆఫర్లు ఇస్తున్నారనో నాణ్యత లేని, లైసెన్స్ లేని బ్రాండ్ల మందులను కొనుగోలు చేయకూడదు. ఎల్లప్పుడూ ప్రామాణిక నాణ్యత, వైద్యుల సలహాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
7. ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు..
సాధారణ జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలకు కూడా ఫార్మసీలకు వెళ్లి సొంతంగా యాంటీబయాటిక్స్ కొని వేసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఇది శరీరంలో ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్’ (drug resistance) పెరగడానికి దారితీస్తుంది.
8. వాడే విధానం, సమయంపై స్పష్టత..
మందులను ఎప్పుడు తీసుకోవాలి..? పరగడుపునా లేక భోజనం తర్వాతా? రోజుకు ఎన్నిసార్లు వాడాలి..? అనే విషయాలను వైద్యుల వద్ద లేదా ఫార్మసిస్ట్ వద్ద ముందే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి.
9. ఇతర ఔషధాల వివరాలు తెలపండి..
మీరు ఇప్పటికే ఇతర సమస్యల కోసం మందులు వాడుతుంటే బీపీ, షుగర్ వంటివి), కొత్తగా మందులు తీసుకునేటప్పుడు ఆ వివరాలను వైద్యులకు స్పష్టంగా తెలియజేయాలి. కొన్ని మందులు ఒకదానితో ఒకటి ప్రతిచర్య (Drug Interaction) జరిపే ప్రమాదం ఉంటుంది.
10. కొనుగోలు బిల్లు తప్పనిసరి..
మందులు కొన్న ప్రతిసారీ జీఎస్టీ,ఫార్మసీ బిల్లును తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ మందుల నాణ్యతలో లోపాలున్నా లేదా తప్పుడు ఔషధం అందినా ఫిర్యాదు చేయడానికి ఈ రశీదు అత్యంత కీలకం.
ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్..
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
