Black Spots on an Onion : ఉల్లిపాయపై నల్లటి మచ్చలు కోసి వాడటం సురక్షితమేనా..?
సాక్షి లైఫ్ : వంటగదిలో ఉల్లిపాయ లేనిదే దాదాపు ఏ కూరా వండలేరు. అయితే, ఉల్లిపాయలు వలుస్తున్నప్పుడు లేదా కోస్తున్నప్పుడు ఒక్కోసారి పైన నల్లటి మచ్చలు (Black spots) కనిపిస్తుంటాయి. చాలామంది వాటిని మట్టి లేదా మురికి అనుకుని, ఆ భాగాన్ని కోసి పడేసి మిగతా ఉల్లిపాయను వాడేస్తుంటారు. కానీ, ఆ నల్లటి మచ్చలు కేవలం మురికి కాకపోవచ్చు. అది ఆరోగ్యానికి హాని చేసే ఫంగస్ కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఆ మచ్చలు ఎందుకు వస్తాయి..?
ఉల్లిపాయలను ఎక్కువ వేడి లేదా తేమ ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల వాటిపై బూజు ఏర్పడే అవకాశం ఉంటుంది. గాలి, నీరు లేదా కీటకాల ద్వారా ఈ ఫంగస్ సులభంగా వ్యాపిస్తుంది. పైకి చిన్న నల్లటి పొరలా లేదా మచ్చల్లా కనిపించినా, లోపలి పొరల వరకు అది విస్తరించి ఉండే ప్రమాదం ఉంది.
కోసి వాడకూడదా..?
నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటే ఆ ఉల్లిపాయను వాడకుండా పారేయడమే ఉత్తమం. పైనున్న నల్లటి భాగాన్ని మాత్రమే కోసి మిగతాది వాడుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే, కంటికి కనిపించకపోయినా ఫంగస్ కణాలు లోపలి పొరల వరకు చొచ్చుకుపోయి ఉంటాయి. కేవలం నీటితో కడగడం లేదా గుడ్డతో గట్టిగా తుడవడం వల్ల అవి పూర్తిగా పోవు. అలాంటి వాటిని తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వాసన చూడటం ప్రమాదకరం..
ఉల్లిపాయ పాడైందో లేదో తెలుసుకోవడానికి కొందరు ముక్కు దగ్గరగా పెట్టి వాసన చూస్తుంటారు. స్పష్టంగా బూజు కనిపిస్తున్నప్పుడు ఇలా వాసన చూడటం వల్ల ఆ ఫంగస్ కణాలు గాలి ద్వారా శ్వాసనాళాల్లోకి చేరి అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఎలా నిల్వ చేయాలి..?
ఉల్లిపాయలను ఎల్లప్పుడూ పొడిగా, గాలి బాగా ఆడే ప్రదేశంలో ఉంచాలి. పాలిథిన్ కవర్లలో అస్సలు ఉంచకూడదు. కొనేటప్పుడే గట్టిగా, పొడిగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. మెత్తగా, తడిగా అనిపించే ఉల్లిపాయలు త్వరగా పాడవుతాయి. మీరు నిల్వ చేసిన ఉల్లిపాయ ల్లో ఏదైనా ఒకదానికి నల్లటి మచ్చలు వేగంగా పెరుగు తున్నట్లు గమనిస్తే, వెంటనే దానిని తీసి పారేయండి. లేదంటే ఆ ఫంగస్ పక్కనున్న ఉల్లిపాయలకు కూడా వ్యాపిస్తుంది. పాడైన ఉల్లిపాయను ఉంచిన బుట్టను లేదా ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచిన తర్వాతే మిగతా వాటిని అక్కడ ఉంచాలి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
