World Pharmacist Day-2026 : చిన్నపాటి నొప్పే కదా అని ఆ మందులు వేసుకుంటున్నారా..? మొదటికే మోసం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి లేదా అలర్జీ రాగానే చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండా నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి మందులు కొని వేసుకుంటారు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ఇతర వ్యాధులను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా సొంత వైద్యం చేసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన (World Pharmacist Day)వరల్డ్ ఫార్మాసిస్ట్ డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం.. 


యాంటీబయాటిక్స్..

 ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నివారణకు మాత్రమే ఉపయోగపడతాయి. జలుబు, ఫ్లూ వంటి వైరల్ వ్యాధులకు ఇవి పనిచేయవు. అవసరం లేకుండా వీటిని వాడితే భవిష్యత్తులో మందులు పనిచేయని స్థితి అంటే డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది.

స్టెరాయిడ్స్..

వాపులు, తీవ్రమైన సమస్యలకు వాడే ఈ మందులను సొంతంగా ప్రారంభించినా, లేదా డాక్టర్ సలహా లేకుండా అకస్మాత్తుగా ఆపేసినా ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

పెయిన్ కిల్లర్స్ ..

 ఐబూప్రోఫెన్, డైక్లోఫెనాక్ వంటి మందులను మోతాదుకు మించి, దీర్ఘకాలం పాటు వాడితే కడుపులో అల్సర్లు, అంతర్గత రక్తస్రావం, కిడ్నీ సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

నిద్రమాత్రలు, యాంగ్జైటీ మందులు..

 డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నిద్రమాత్రలు వాడటం వల్ల మత్తుగా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఈ మందులకు బానిసలయ్యే ప్రమాదం ఉంది.

బీపీ, గుండె సంబంధిత మందులు..

 ఇతరులకు రాసిచ్చిన రక్తపోటు, గుండె జబ్బుల మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఏమాత్రం మోతాదు మారినా బీపీ ఒక్కసారిగా పడిపోవడం లేదా పెరిగిపోయి ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు.

మందుల వాడకంలో చేసే తప్పులు..

 ఒకరికి పనిచేసిన మందు మీకు సురక్షితం కాకపోవచ్చు. శరీర బరువు, వయసు, అలర్జీలను బట్టి మందుల ఎంపిక మారుతుంది. జబ్బు త్వరగా తగ్గాలని డోస్ పెంచి వేసుకోవడం, లేదా మీకై మీరే డోస్ తగ్గించడం వల్ల చికిత్స లక్ష్యం దెబ్బతింటుంది. గతంలో వచ్చిన లక్షణాలే మళ్లీ కనిపిస్తున్నాయని పాత వైద్యుల చీటీల ఆధారంగా మళ్లీ అవే మందులు కొని వాడటం సరికాదు. వ్యాధి కారణం వేరై ఉండొచ్చు.

ఇతరులు వాడగా మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడటం, లేదా కోర్సు పూర్తికాకుండానే మధ్యలో ఆపేయడం లాంటివి చేయకూడదు. ఏదైనా మందు వేసుకున్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం లేదా గొంతు వాపు, కళ్లు తిరగడం, అపస్మారక స్థితి లేదా రక్తపు వాంతులు జరిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.