Refrigerator : ఫ్రిజ్‌లో ఈ వస్తువులు పెడుతున్నారా..? అయితే వాటి రుచి, నాణ్యత దెబ్బతిన్నట్టే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వెంటనే వాటిని ఫ్రిజ్‌లో (refrigerator) పెట్టేయడం మనలో చాలామందికి అలవాటు. పాలు, పెరుగు, మిగిలిపోయిన కూరలు, త్వరగా పాడైపోయే వస్తువులకు ఫ్రిజ్ సరైన ప్రదేశమే అయినా.. అన్నింటికీ కాదు. కొన్నింటిని అతిశీతల వాతావరణంలో ఉంచితే వాటి సహజ రుచి, ఆకృతి, నాణ్యత తీవ్రంగా దెబ్బతింటాయి. గది ఉష్ణోగ్రత వద్ద, గాలి తగిలే పొడి ప్రదేశాల్లో మాత్రమే ఉంచాల్సిన ఆ ఐదు పదార్థాలేమిటో తెలుసుకుందాం..

1. ఆలుగడ్డలు..

ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని పిండిపదార్థం రసాయన మార్పులకు గురై తీయగా మారుతుంది. దీనివల్ల వాటి సహజ రుచి దెబ్బతింటుంది. ఆలుగడ్డలను ఎప్పుడూ గాలి ఆడే బుట్టల్లో లేదా వలల్లా ఉండే సంచుల్లో ఉంచి, పొడిగా మరియు చీకటిగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

2. టమాటాలు..

టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి కణజాలం దెబ్బతిని సహజ ఆకృతిని, రుచిని కోల్పోతాయి. వండుకోవడానికి సిద్ధంగా ఉన్న, పూర్తిగా పండిన టమాటాలను గది ఉష్ణోగ్రత వద్దే బయట ఉంచడం మంచిది.

3. తేనె..

తేనెను ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. చల్లటి వాతావరణంలో తేనె త్వరగా గట్టిపడి, స్పటికాల్లా (క్రిస్టల్స్) మారుతుంది. దీనివల్ల అది పాడవకపోయినా, వాడుకోవడానికి చాలా కష్టమవుతుంది. తేనెను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద, వేడి మరియు తేమ తగలని చోట గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి.

4. బ్రెడ్..

బ్రెడ్‌ పాడవకుండా ఉంటుందని చాలామంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బ్రెడ్ త్వరగా ఎండిపోయి, గట్టిగా లేదా పాతదానిలా మారుతుంది. రోజువారీ వాడుకునే బ్రెడ్‌ను బయటే ఉంచుకోవడం మంచిది.

5. అరటిపండ్లు..

అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెడితే వాటి పై తొక్క త్వరగా నల్లబడి పోతుంది. లోపలి పండు కూడా రుచి మారుతుంది. అరటిపండ్లను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. అలాగే ఎక్కువ వేడి తగిలే ప్రదేశాలకు కూడా వీటిని దూరంగా ఉంచడం మేలు.

మరి ఫ్రిజ్‌లో వేటిని ఉంచాలి..?

అలా అని ఫ్రిజ్‌లో ఏమీ పెట్టకూడదని కాదు. పాలు, మాంసం, చేపలు, వండిన ఆహారం, పండ్లు, కూరగాయలు లాంటివి త్వరగా పాడైపోతాయి కాబట్టి వాటిని తప్పనిసరిగా 4°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిజ్‌లోనే నిల్వ చేయాలి. ఆహార పదార్థాలను నిల్వ చేసే ముందు వాటి ప్యాకింగ్ మీద ఉండే సూచనలు గమనించడం ద్వారా ఆహారం కలుషితం కాకుండా నాణ్యతను కాపాడుకోవచ్చు. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.