పారాసిటమాల్ సైడ్ ఎఫెక్ట్స్..
సాక్షి లైఫ్ : జ్వరమైనా..ఒళ్ళునొప్పులైనా చాలామందికి గుర్తొచ్చేది పారాసెటమాల్ టాబ్లెట్.. ఈ మాత్ర వేసుకోమని కొందరయితే ఉచిత సలహా కూడా ఇస్తుంటారు. ఆ సలహాను వెంటనే పాటిస్తారు. జ్వరం వచినప్పుడే కాదు.. తలనొప్పి, పంటి నొప్పి, బెణుకులు, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఏమాత్రం అనిపించినా .. పారాసిటమాల్ ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పారాసెటమాల్‌ను ఎసిటమైనోఫెన్ అని కూడా పిలుస్తారు.
ఇది కూడా చదవండి.. మూడు దశాబ్దాల్లో నాలుగు రెట్లు పెరిగిన స్థూలకాయ సమస్యలు
దుష్ప్రభావాలు...
పారాసెటమాల్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే..? ఉంటాయని అంటున్నారు. దీని వల్ల సమస్యలుప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని సార్లు వినియోగించక తప్పదు. అయితే పారాసిట మాల్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా ప్రమాదం అని చెబుతున్నారు పరిశోధకులు.
జర జాగ్రత్త..
కొన్ని సమయాల్లో ప్రాణాంతకం కూడా కావొచ్చట. అధిక మోతాదులో తీసుకోవడం, లేదా ఉప్పునీటి తో పారాసెటమాల్ తీసుకోవడంవల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఎంత మోతాదులో పారాసిటమాల్ ప్రభావవంతంగా పనిచేస్తుందనే దానిపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
చిన్నారులకైతే..
పెద్దలకైతే ఒక మోతాదుకు 1 గ్రాము తీసుకోవాలి, అలా ఒక రోజులో 4 గ్రాములకు మించి తీసుకోకూడదు. ఒకవేళ వారికి ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉండి ఉంటే ఇందులో సగం వంతు అంటే ఒక రోజులో 2 గ్రాములకు మించి పారాసెటమాల్ తీసుకోవద్దు. పిల్లలకు వేసేటపుడు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
సమస్య వచ్చిన ప్రతిసారి పారాసెటమాల్ ఇష్టారీతిన తీసుకోవడం మంచిది కాదు. అవసరం మేరకే, తక్కువ మోతాదు నుంచి తీసుకుంటుండం చేయాలి.
వివిధ రకాల ఔషధాలు..
వివిధ రకాల సమస్యలకు వివిధ రకాల ఔషధాలు ఉంటాయి. ప్రతి ఔషధం భిన్నమైన పనితీరు కలిగి ఉంటుంది. కొన్ని కొన్ని మందులు ఖాళీ కడుపుతో తీసుకోవాలి, మరిన్నింటిని పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా.. ఎలా తీసుకోవాలి..? ఎంత మోతాదులో తీసుకోవాలి..? అని స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ఆ ప్రకారమే ఆయా మెడిసిన్స్ వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. పోషకాహారలోపం వల్ల ఎలాంటి నష్టాలున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
