Triglyceride Levels ,Heart Disease రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి, గుండె సంబంధిత సమస్యలకు ఏంటి లింక్..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గుండె ఆరోగ్యం అనగానే అందరూ కేవలం 'కొలెస్ట్రాల్' స్థాయిలపైనే దృష్టి పెడతారు. కానీ, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) పెరగడం కూడా కొలెస్ట్రాల్‌తో సమానంగా గుండెకు హాని చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు (BP), కొలెస్ట్రాల్‌తో పాటు ట్రైగ్లిజరైడ్స్ కూడా అదుపు తప్పితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి..?

ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థాలు. మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి కేలరీలు అందుతాయి. అయితే, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు అందినప్పుడు, అదనపు కేలరీలను శరీరం ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ చేసుకుంటుంది. నిజానికి ఇవి శరీరానికి శక్తినివ్వడానికి కొంతమేర అవసరమే అయినప్పటికీ, రక్తంలో వీటి మోతాదు పరిమితికి మించి పెరిగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే కలిగే నష్టాలేమిటి..?

గుండెపోటు, స్ట్రోక్ ముప్పు..రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి అధికంగా ఉన్నప్పుడు రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోయి, అవి గట్టిపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు. పాంక్రియాటైటిస్(pancreatitis).. ఈ కొవ్వు స్థాయిలు విపరీతంగా పెరిగితే పాంక్రియాస్(Pancreas) వాపునకు గురయ్యే 'పాంక్రియాటైటిస్' అనే తీవ్ర సమస్య రావచ్చు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు.. కాలక్రమేణా ఇది టైప్-2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది.

వీటి స్థాయిని పెంచే ఆహారపు అలవాట్లు ఏవి..?

 ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ చాలా వేగంగా పెరుగుతాయి. తరచూ మద్యం సేవించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది రక్తపోటును కూడా పెంచి గుండెపై అదనపు భారం మోపుతుంది. మైదాతో చేసిన పదార్థాలు, వైట్ బ్రెడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్ తరచూ తినడం వల్ల ఈ కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి.

నియంత్రణ ఎలా అంటే..?

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవ డానికి వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు 'లిపిడ్ ప్రొఫైల్' (Lipid Profile) రక్త పరీక్ష చేయించుకోవాలి. వీటిని అదుపులో ఉంచుకోవడానికి చక్కెర, నూనె పదార్థాలు, మైదా వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో పీచు పదార్థాలు (fiber), ఆకుకూరలు, పండ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని చేర్చుకోవడంతో పాటు రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.