Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడకపోతే చాలామందికి రోజు గడవదు. పరకడుపున టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే, ఈ అలవాటు వల్ల జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా? టీకి, జుట్టు రాలడానికి ఉన్న సంబంధం ఏమిటో, జుట్టును కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఖాళీ కడుపుతో టీ తాగడానికి, జుట్టు రాలడానికి మధ్య ఉన్న సంబంధం ప్రధానంగా శరీరంలో 'ఐరన్' (iron) శోషణపై ఆధారపడి ఉంటుంది. టీలో పాలిఫెనాల్స్, టానిన్స్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలన్నా, ఎదుగుదల బాగుండాలన్నా రక్తంలో హిమోగ్లోబిన్, ఐరన్ చాలా అవసరం. నిత్యం పరకడుపున టీ తాగడం వల్ల దీర్ఘకాలంలో ఐరన్ లోపం ఏర్పడి, అది తీవ్రమైన హెయిర్ ఫాల్‌కు దారితీస్తుంది. ఆహారంతో పాటే టీ తీసుకుంటే ఐరన్ శోషణ (iron deficiency)తగ్గుతుందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

జుట్టు రాలడానికి ఇతర కారణాలు..

కేవలం టీ తాగడం వల్లే కాదు, జుట్టు రాలడానికి శరీరంలోని మరికొన్ని సమస్యలు కూడా కారణం కావచ్చు:

ఐరన్ లోపం(iron deficiency).. రక్తంలో ఫెర్రిటిన్, ఐరన్ స్థాయిలు తగ్గడం వల్ల.

థైరాయిడ్ సమస్యలు(Thyroid issues).. థైరాయిడ్ హార్మోన్లలో వచ్చే అసమతుల్యత హెయిర్ ఫాల్‌కు దారితీస్తుంది.

ఒత్తిడి.. మానసిక ఒత్తిడి, తీవ్రమైన అనారోగ్యం లేదా ఏదైనా సర్జరీ తర్వాత కొంతకాలం పాటు జుట్టు ఎక్కువగా రాలుతుంది.

హార్మోన్ల మార్పులు..గర్భధారణ సమయంలో, డెలివరీ తర్వాత, మెనోపాజ్ దశలో ఈ సమస్య సహజం.

ప్రొటీన్ లోపం..జుట్టు ప్రధానంగా 'కెరాటిన్' అనే ప్రొటీన్‌తో నిర్మితమవుతుంది. ఆహారంలో తగినంత ప్రొటీన్ లేకపోతే జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతుంది.

జన్యుపరమైన కారణాలు.. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల లేదా జుట్టు పలచబడే సమస్యలు.

ఉదయం టీ తాగే సరైన విధానం-తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

టీ తాగే అలవాటును పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మీ జుట్టునూ కాపాడుకోవచ్చు. నీళ్లతో మొదలు..ఉదయం నిద్రలేవగానే ముందుగా ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఖాళీ కడుపుతో వద్దు.. పరకడుపున కాకుండా, ఏదైనా తేలికపాటి అల్పాహారం బిస్కెట్ లేదా పండ్లు తీసుకున్నాకే టీ తాగాలి.

గ్యాప్ ముఖ్యం.. భోజనానికి, టీ తాగడానికి మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారు ఈ నియమం తప్పక పాటించాలి. పోషకాహారం.. ఆకుకూరలు, కాయధాన్యాలు, సెనగలు, రాజ్మా, డ్రై ఫ్రూట్స్ వంటి ఐరన్, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి.

విటమిన్-సి..మీరు తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహించాలంటే విటమిన్-సి అవసరం. అందుకోసం ఉసిరి, నిమ్మ, జామ వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. రోజులో మోతాదుకు మించి రెండు, మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.