Work From Home : ఇంటి నుంచే పనిచేస్తున్నా విపరీతమైన అలసట ఎందుకు వస్తుందో తెలుసా..?
సాక్షి లైఫ్ : ఆఫీసుకు వెళ్లే ప్రయాణ బడలిక ఉండదు కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేస్తే శరీరానికి తక్కువ శ్రమ ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఆఫీసులో కంటే ఇంటి వద్ద పనిచేసేవారే రోజు పూర్తయ్యేసరికి తీవ్రమైన శారీరక, మానసిక అలసటకు గురవుతున్నారు.
ఇంట్లో పనిచేస్తే అలసట ఎందుకు వస్తుంది..?
ఆఫీసులో అయితే క్యాంటీన్‌కు వెళ్లడం, తోటి ఉద్యోగులను కలవడం, మెట్లు ఎక్కడం వంటి చిన్నపాటి శారీరక కదలికలు ఉంటాయి. ఇంట్లో కదలకుండా ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోయి నీరసం ఆవరిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల స్క్రీన్లను నిరంతరాయంగా చూడటం వల్ల కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడి తలనొప్పి, కంటి అలసట వస్తాయి. ఇది మెదడును కూడా త్వరగా అలిసిపోయేలా చేస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా వరుస ఆన్‌లైన్ మీటింగ్‌లు ఉంటాయి. అందులో నిరంతరం చురుకుగా పాల్గొనాల్సి రావడం, స్క్రీన్‌పైనే దృష్టి సారించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసు వాతావరణంలో సహజంగానే టీ, లంచ్ బ్రేక్‌లు దొరుకుతాయి. కానీ ఇంట్లో పనిలో పడిపోయి చాలామంది అసలు బ్రేక్ తీసుకోవడమే మర్చిపోతుంటారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
వ్యక్తిగత, వృత్తిగత జీవితం కలిసిపోవడం..ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే ప్రయాణ సమయం మెదడుకు పని ఒత్తిడి నుంచి కొంత విరామం ఇస్తుంది. ఇంట్లో ఆ అవకాశం లేకపోవడం వల్ల పనివేళలు ముగిసినా కూడా మెయిల్స్, ప్రాజెక్టుల గురించే ఆలోచిస్తుంటారు. సహజ గాలి, వెలుతురు కరవు.. సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ప్రసరించని గదుల్లో రోజంతా కూర్చోవడం వల్ల శరీరం త్వరగా బద్ధకానికి లోనవుతుంది.
అలసటను జయించే మార్గాలు..
ప్రతి గంటకు ఒకసారి కచ్చితంగా చిన్న బ్రేక్ తీసుకుని అటూఇటూ నడవాలి. కుర్చీలో నుంచి లేచి చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. 20 నిమిషాలకోసారి స్క్రీన్ నుంచి దృష్టి మరల్చి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఇంట్లో పని చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని, కచ్చితమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పనిచేయకూడదు. workపని వేళలు ముగిసిన వెంటనే సిస్టమ్ ఆఫ్ చేసి, ఆఫీస్ నోటిఫికేషన్లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మధ్యమధ్యలో మంచి నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
