Parenting tips : ఒక పేరెంట్‌గా మీ మానసిక ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : పిల్లల ప్రతి పనినీ మీరే చేస్తూ, వారిని తమ కాళ్లపై తాము నిలబడనివ్వకుండా (Independence) అడ్డుకుంటున్నారా? వయసుకు తగ్గ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను మీ పిల్లలకు ఇస్తున్నారా? పిల్లల వ్యక్తిగత అభిరుచులను వారి ప్రైవసీని మీరు గౌరవిస్తున్నారా? తమకు ఇష్టం లేని దానికి "వద్దు" అని చెప్పే హక్కును మీ పిల్లలకు ఇస్తున్నారా లేదా దాన్ని అహంకారంగా భావించి అణిచివేస్తున్నారా?వారు తప్పు చేసినప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నారా లేదా వెంటనే కఠినంగా శిక్షిస్తున్నారా?ఆఫీసులో లేదా ఇతర చోట్ల మీకున్న ఒత్తిడిని, కోపాన్ని పిల్లల మీద చూపిస్తున్నారా?భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతున్నాయో ఆలోచించారా..? మీరు పిల్లల పట్ల తప్పు చేసినప్పుడు, వారి ముందు అంగీకరించి 'క్షమాపణ' (Sorry) అడిగే ధైర్యం మీకు ఉందా..?ఇంట్లో పిల్లలకు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం ఉందా లేదా ఎప్పుడూ 'భయం' రాజ్యమేలుతోందా..? పిల్లల భయాలను మీరు విస్మరిస్తున్నారా లేక వాటికి భరోసా ఇస్తున్నారా..? " మగపిల్లలు ఏడవకూడదు" లేదా "ఆడపిల్లలు ఇలాగే ఉండాలి" లాంటి మూస పద్ధతులను మీ పిల్లలపై రుద్దుతున్నారా..?పిల్లలు తమ కష్టాలను చెప్పుకున్నప్పుడు, మీరు తీర్పు ఇవ్వకుండా (without judgement) ప్రశాంతంగా వింటున్నారా?పక్కింటి పిల్లలతో లేదా తోబుట్టువులతో మీ పిల్లలను పదేపదే పోలుస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారా? మీ తీరని కోరికలను, లక్ష్యాలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారా?చదువులో ఎప్పుడూ ఫస్ట్ రావాలనే ఒత్తిడి వారి మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఎప్పుడైనా గమనించారా? పిల్లల సామర్థ్యానికి మించిన అంచనాలు పెట్టుకుని, వారు విఫలమైనప్పుడు నిరాశపరుస్తున్నారా?వారు ఆటల్లో లేదా చదువులో ఓడిపోయి నప్పుడు వెన్నంటి ఉంటున్నారా లేక విమర్శిస్తున్నారా? మీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా బాధపడుతున్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకుంటున్నారా లేదా "ఊరుకో, ఇందులో ఏడ్చేదేముంది?" అని కోపపడుతున్నారా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.