Vitamins for Liver Health : కాలేయ ఆరోగ్యానికి విటమిన్లు అత్యసరం.. ఇవి లోపిస్తే ముప్పే..!
సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో విటమిన్లు, ప్రొటీన్ల లోపం వల్ల కేవలం నీరసం, రక్తహీనత రావడం మాత్రమే కాదు.. కాలేయం (liver) ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. శరీరంలో జీర్ణక్రియను సులభతరం చేయడం, వ్యర్థాలను బయటకు పంపడం, శక్తిని నిల్వ చేయడం వంటి ఎన్నో కీలక విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. కాబట్టి దాని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం..
లివర్ సమస్యలతోనే విటమిన్ల లోపం..
విటమిన్ల లోపం వల్లే కాలేయం పాడవుతుందని కాదు.. కొన్నిసార్లు కాలేయ వ్యాధుల వల్ల కూడా శరీరం విటమిన్లను సరిగ్గా గ్రహించలేకపోతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఏ, డీ, ఈ, కే (A, D, E, K) విటమిన్ల లోపం స్పష్టంగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
విటమిన్-ఏ (Vitamin A)..
కంటి చూపు, చర్మ సౌందర్యం, రోగనిరోధక శక్తికి ఇది చాలా అవసరం. శరీరంలోని 80 నుంచి 90 శాతం విటమిన్-ఏ కాలేయంలోనే నిల్వ ఉంటుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు ఉన్నవారిలో ఈ విటమిన్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల రేచీకటి, చర్మ సమస్యలు వస్తాయి.
విటమిన్-డీ (Vitamin D)..
ఎముకలు, కండరాల దృఢత్వానికి ఇది కీలకం. ఫ్యాటీ లివర్ (NAFLD), హెపటైటిస్ లాంటి కాలేయ వ్యాధులు ఉన్నవారిలో విటమిన్-డీ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల కాలేయంలో వాపు (fibrosis) వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.
విటమిన్-ఈ (Vitamin E)..
కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడటంలో ఇది సాయపడుతుంది. శరీరంలో కొవ్వును గ్రహించే ప్రక్రియలో ఆటంకం తలెత్తినప్పుడు విటమిన్-ఈ లోపిస్తుంది. లివర్ వాపు, కణాల డ్యామేజీని తగ్గించడంలో ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
విటమిన్-కే (Vitamin K)..
గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే చిన్న దెబ్బ తగిలినా రక్తం ఆగకుండా పోతుంది. విటమిన్-కే చిన్నప్రేగులలో శోషించాలంటే కాలేయం, పిత్తాశయం ఉత్పత్తి చేసే పైత్యరసం (Bile) అవసరం. సిర్రోసిస్ వంటి లివర్ సమస్యల వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి విటమిన్-కే లోపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు, తరచుగా అలసట, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కాలేయ పనితీరు పరీక్షలు (LFT) చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
