High Blood Pressure Risk in Children : పిల్లలకూ 'హై బీపీ' ముప్పు.. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : హై బీపీ (hypertension) అనగానే అది కేవలం పెద్దవయసు వారిలోనే, వృద్ధుల్లోనే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ ముప్పు ఇప్పుడు చిన్న పిల్లలనూ వెంటాడుతోంది. గత రెండు దశాబ్దాల్లో 19 ఏళ్లలోపు పిల్లల్లో అధిక రక్తపోటు కేసులు దాదాపు రెట్టింపయ్యాయని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రధాన కారణాలు ఇవే..
పిల్లల్లో బీపీ పెరగడానికి ముఖ్యంగా ఊబకాయం (obesity), శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్స్ (junk food)అధిక ఉప్పు ఉండే ఆహారం ఎక్కువగా తినడం ప్రధాన కారణాలు. వీటితో పాటు జన్యుపరమైన సమస్యలు, కిడ్నీ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత కూడా బీపీ పెరగడానికి దారితీస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
పిల్లల్లో సాధారణ బీపీ ఎంత ఉండాలి..?
పెద్దల మాదిరిగా పిల్లలందరికీ 120/80 బీపీ ఉండదు. పిల్లల వయసు, ఎత్తు, లింగ భేదాన్ని బట్టి బీపీ రీడింగ్ మారుతుంటుంది.
1 నుంచి 3 ఏళ్లు.. 90-105 / 55-70 mmHg
3 నుంచి 6 ఏళ్లు: 95-110 / 60-75 mmHg
6 నుంచి 12 ఏళ్లు: 100-120 / 60-75 mmHg
13 ఏళ్లు పైబడిన వారికి: 120/80 కంటే తక్కువగా ఉండాలి.
లక్షణాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చాలామంది పిల్లల్లో బీపీ పెరిగినా ఎలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, చూపు మసకబారడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని సాధారణ సమస్యలుగా కొట్టిపారేయకూడదు. బీపీ దీర్ఘకాలం పాటు నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, మూడేళ్లు పైబడిన పిల్లలకు కనీసం ఏడాదికి ఒకసారైనా రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగా బీపీ పరీక్ష తప్పనిసరిగా చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
