videos
Heart Attacks : 20,40 ఏళ్ల వయసులో గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంతసేపు వ్యాయామం చేయాలి? నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాల్లో గుండెకు ఏది ఎక్కువ ప్రయోజనకరం? వ్యాయామం ప్రారంభించే ముందు ఏయే వార్మప్ వ్యాయామాలు చేయాలి? చాలాకాలంగా వ్యాయామం చేయని వ్యక్తులు ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామాలు చేయడం ప్రమాదకరమా? జిమ్‌లో అధిక బరువులు ఎత్తడం, హై-ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడం గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి, తల తిరగడం, అసాధారణంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఎలాంటి వ్యాయామాలు చేయాలి? గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యువత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అధిక ఉప్పు, చక్కెర, నూనె పదార్థాలు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి? గుండె ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యం? యువతలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలి?గతంలో వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండెపోటు ఇప్పుడు యువతలో కూడా ఎందుకు పెరుగుతోంది..? యువతలో గుండెపోటు కేసులు నిజంగానే పెరుగుతున్నాయా? దీనికి సంబంధించిన వైద్య గణాంకాలు ఏం చెబుతున్నాయి? వ్యాయామం చేస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు వెంటనే ఏం చేయాలి? CPR, AED ఎంతవరకు ప్రాణాలను కాపాడగలవు? యువత గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవ డానికి రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
