ముఖంలో పిగ్మెంటేషన్‌కు కారణాలు-పరిష్కారాలు..?    

షేర్ చేయండి:
ముఖంలో పిగ్మెంటేషన్‌కు కారణాలు-పరిష్కారాలు..?    

సాక్షి లైఫ్: ఒక్కోసారి ముఖం చిన్న చిన్న మచ్చలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలేంటి..? చర్మ సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, విటమిన్ లోపం కారణంగా ముఖంలో మార్పులు చోటుచేసుకుంటాయని, ముఖ్యంగా కొన్నిరకాల విటమిన్స్ లోపించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 

సాధారణంగా ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్‌కు విటమిన్ బి 12లోపం కారణమని నిపుణులు చెబుతూంటారు. మరి ఈ విటమిన్‌ మాత్రమే కాకుండా పిగ్మెంటేషన్‌కు దారితీయగల మరికొన్ని విటమిన్ల లోపాన్ని అధిగమించడం ఎలా? 

 
ఏ విటమిన్ లోపం వల్ల ముఖంపై మచ్చలు వస్తాయి..? 

వయసు పెరుగుతున్న కొద్దీ మనం చర్మానికి సాగే లక్షణం తగ్గిపోతూంటుంది. అదే సమయంలో శరీరంలో కొన్ని విటమిన్లు తగ్గి పోతుంటాయి. తగిన ఆహారం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. మొటిమలు ఏర్పడతాయి, ముఖంపై మచ్చలు వస్తాయి, చర్మం పొడిగా మారుతుంది, పెదవులపై పగుళ్లు ఏర్పడతాయి. 

"విటమిన్ B12" లభించే ఆహారం.. 

 జంతు సంబంధిత ఆహారాల్లో బి12 ఎక్కువగా ఉంటుంది.  మరి శాఖాహారులకు ఈ విటమిన్‌ ఎలా లభిస్తుందని అనుకోనవసరం లేదు. మనం తరచూ తినే పెరుగులో విటమిన్ బి12 పుష్కలం.  కప్పు పెరుగులో మన శరీరానికి ఒక రోజులో కావాల్సిన బీ12లో 28 శాతం  లభిస్తుంది. పెరుగుతోపాటు ఇతర పాల ఉత్పత్తుల్లోనూ వేర్వేరు మోతాదుల్లో బీ12 ఉంటుంది.    

చిరు ధాన్యాలు "విటమిన్ బి12"తో పాటు ఫోలేట్, ఐరన్, విటమిన్ "ఏ "ను అందిస్తాయి. బలవర్థకమైన చిరు ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ బి12 స్థాయులు పెరుగుతాయి.

 -యాపిల్.. 

 విటమిన్ B12 సమృద్ధిగా ఉన్న అనేక పండ్లలో ఇది ఒకటి. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ , పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.  

బాదం, వేరుశెనగ.. 

బాదం, వేరుశెనగ వంటి వాటిలో "విటమిన్ బి12" పుష్కలంగా లభిస్తుంది.   

 అరటి.. 

 అరటి పండ్లలో తగినంత "విటమిన్ బి12" ఉంటుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది, శరీర ఒత్తిడిని నియంత్రిస్తుంది. అంతేకాదు మలబద్ధకం , అల్సర్ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.

-నారింజ.. 

నారింజలు విటమిన్ సి, కాల్షియం, బీటా కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే పండ్లలో ఇది కూడా ఒకటి.

బ్లూబెర్రీస్.. 

బ్లూబెర్రీస్‌లో "విటమిన్ బి12" కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.