Teenage Girls health : టీనేజ్ లో అమ్మాయిలకు తల్లులు తప్పకుండా నేర్పించాల్సిన ఆరోగ్య నియమాలు ఇవే..
సాక్షిలైఫ్ : కౌమారదశ అనేది ప్రతి అమ్మాయి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఈ వయసులో శరీరంలో, హార్మోన్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, నేటికీ చాలా కుటుంబాల్లో రుతుక్రమం , వ్యక్తిగత పరిశుభ్రత, ప్రైవేట్ భాగాల శుభ్రత లాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు తరచుగా ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటప్పుడు ఒక తల్లిగా కూతురితో ఈ ఆరోగ్య విషయాలపై పారదర్శకంగా మాట్లాడటం చాలా ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధుల ముప్పు తగ్గడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
1.నెలసరి సమయంలో పరిశుభ్రత..
క్రమం అనేది శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ అని కూతురికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపాన్లు లేదా మెన్‌స్ట్రువల్ కప్పులను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. ఒకే ప్యాడ్‌ను ఎక్కువ గంటల పాటు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని, ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి వాటిని మార్చుకోవాలని సూచించాలి.
2. ప్రైవేట్ భాగాల శుభ్రత విషయంలో జాగ్రత్తలు..
జననాంగాల శుభ్రత కోసం కేవలం స్వచ్ఛమైన నీరు లేదా వైద్యులు సూచించిన మైల్డ్ వాష్‌లను మాత్రమే ఉపయోగించాలి. రసాయనాలు, గాఢమైన సువాసనలు వెదజల్లే సబ్బులను వాడకూడదని చెప్పాలి. ఇవి అక్కడ ఉండే సహజ సిద్ధమైన పీహెచ్ (pH) బ్యాలెన్స్‌ను దెబ్బతీసి, బ్యాక్టీరియా పెరగడానికి దారి తీస్తాయి.
3. కాటన్ లోదుస్తులకే ప్రాధాన్యం..
ప్రతిరోజూ ఉతికిన, శుభ్రమైన లోదుస్తులను మాత్రమే ధరించేలా అలవాటు చేయాలి. ముఖ్యంగా కాటన్ దుస్తులు గాలి ఆడేలా చేసి, చెమటను పీల్చుకుంటాయి. సింథటిక్ దుస్తుల వల్ల తేమ అలాగే ఉండిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
4. నెలసరి అపోహలను తొలగించండి..
నెలసరి అనేది ఎలాంటి అనారోగ్యం కాదని స్పష్టం చేయాలి. ఆ రోజుల్లో సాధారణ దినచర్యలు, చదువు, తేలికపాటి వ్యాయామాలు యథావిధిగా చేసుకోవచ్చని ధైర్యం చెప్పాలి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే నీరసాన్ని జయించవచ్చని వివరించాలి.
5. ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు..
శరీరంలో ఏవైనా తేడాలు గమనిస్తే దాచుకోకుండా చెప్పే చనువును కూతురికి ఇవ్వాలి. విపరీతమైన దురద, దుర్వాసన, అసాధారణ వైట్ డిశ్చార్జ్, విపరీతమైన కడుపునొప్పి లేదా పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తుంటే సిగ్గుపడకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలి.
6. శారీరక మార్పులు సహజమేనని భరోసా ఇవ్వాలి..
గుతున్న వయసుతో పాటు వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వాలి. ఏవైనా సందేహాలు ఉంటే స్నేహితురాలిలా తనతో పంచుకునే స్వేచ్ఛను కూతురికి ఇచ్చినప్పుడే, ఆమె శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతుంది.
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
